Begin typing your search above and press return to search.

సిక్స్ ప్యాక్ తెచ్చుకున్నాకే సినిమా చేస్తాను

By:  Tupaki Desk   |   6 Dec 2021 10:04 AM IST
సిక్స్ ప్యాక్ తెచ్చుకున్నాకే సినిమా చేస్తాను
X
విలువిద్య నేపథ్యంలో నాగశౌర్య హీరోగా చేసిన 'లక్ష్య' సినిమా, ఈ నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి జరిగింది. ముఖ్య అతిథుల్లో ఒకరైన శర్వానంద్ ఈ స్టేజ్ పై మాట్లాడుతూ .. "ముందుగా జై బాలయ్య .. 'అఖండ' సినిమాతో మళ్లీ ఆయన థియేటర్స్ కి పూర్వ వైభవం తీసుకువచ్చారు.

ఈ సీజన్ ఒక మంచి సినిమాతో మొదలైంది. అందుకు తెలుగు ప్రేక్షకులకు నేను థ్యాంక్స్ చెబుతున్నాను. పుల్లెల గోపీచంద్ వంటి గ్రేట్ నేషనల్ ప్లేయర్ తో కలిసి ఈ స్టేజ్ ను పంచుకోవడం ఆనందంగా ఉంది.

డైరెక్టర్ సంతోష్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఆయన కష్టం స్క్రీన్ పై కనిపిస్తోంది. ఈ సినిమా నిర్మాతలంతా కూడా నాకు బిగ్ బ్రదర్స్ వంటివారు. నా మంచి కోరుకునే వ్యక్తులలో వాళ్లు ఒకరు. నిర్మాత సునీల్ గారు 'లవ్ స్టోరీ'తో పెద్ద హిట్ ఇచ్చారు. ఈ సినిమాతో నాగశౌర్యకి పెట్ట హిట్ ఇస్తున్నారు. ఈ సినిమా హిట్ అవుతుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు.

ఎందుకంటే ఒక స్పోర్ట్స్ ఫిల్మ్ చేయడానికి చాలా ధైర్యం కావాలి .. తీయడానికి చాలా ధైర్యం కావాలి. ఈ మధ్య కాలంలో చాలా స్పోర్ట్స్ ఫిలిమ్స్ వచ్చాయి .. అవన్నీ కూడా హిట్టే అయ్యాయి.

స్పోర్ట్స్ నేపథ్యంలో సబ్జెక్ట్ అనగానే ఫస్టు బర్డెన్ హీరోపై పడిపోతుంది. ఎందుకంటే ఆ పాత్రకి ట్యూన్ కావాలి .. కొంత శిక్షణ తీసుకోవాలి . ఎంతో అంకితభావంతో చేయవలసి ఉంటుంది.

నాగశౌర్య నాకు మంచి ఫ్రెండ్ .. ఒక యంగర్ బ్రదర్ అని చెప్పుకోవచ్చు. తను నాతో కంటే కూడా మా తమ్ముడితో ఎక్కువగా తిరుగుతూ ఉంటాడు. తను చాలా డేడికేటెడ్ యాక్టర్. తన ట్రాన్స్ఫర్మేషన్ చూసి నేను చాలా షాక్ అయ్యాను. అందుకోసం ఎంతగా కష్టపడాలనేది నాకు తెలుసు.

'ఆడవాళ్ల మాటలకు అర్థాలు వేరులే' .. ' ఒకే ఒక జీవితం' తరువాత, నాగశౌర్యలా సిక్స్ ప్యాక్ తెచ్చుకుంటాను. ఆ తరువాతనే సినిమాను చేస్తాను. శౌర్య నాకు ఇన్స్పిరేషన్. ఆయన ఎప్పుడూ కూడా సరదాగా అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు. ఎంతోకష్టపడి త్తనకంటూ ఒక మార్కెట్ తెచ్చుకున్నాడు. మా బాస్ చిరంజీవి చెప్పినట్టుగా డిఫినెట్లీ తాను కాబోయే సూపర్ స్టార్.

బాలీవుడ్ కి కూడా వెళ్లిపోవాలని కోరుకుంటున్నాను. కేతిక కూడా చాలా బాగా చేసింది. ఈ సినిమా ఈ నెల 10వ తేదీన రిలీజ్ అవుతోంది .. థియేటర్స్ కి వెళ్లి చూడండి . ఎంజాయ్ చేయండి" అంటూ చెప్పుకొచ్చాడు.