Begin typing your search above and press return to search.

పరుశురాం.. గీతా ఆర్ట్స్.. ఓ కుర్ర హీరో

By:  Tupaki Desk   |   11 Aug 2016 10:48 AM IST
పరుశురాం.. గీతా ఆర్ట్స్.. ఓ కుర్ర హీరో
X
అల్లు శిరీష్- లావణ్య త్రిపాఠి జంటగా నటించిన శ్రీరస్తు శుభమస్తు చిత్రంతో దర్శకుడు పరశురాం అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. గతంలో సోలో చిత్రంతో ఫ్యామిలీ ఎమోషన్స్ పండించిన ఈ డైరెక్టర్.. ఆ జోనర్ లో తనకు ఎంత పట్టుందో శ్రీరస్తు చిత్రంతో ప్రూవీ చేసుకున్నాడు. ఇప్పటికే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ గీతా ఆర్ట్స్ తోనే అని చెప్పగా.. పరశురాం తీయబోయే మరుసటి చిత్రం గురించి ఇప్పుడు కొన్ని డీటైల్స్ తెలిశాయి.

చెప్పినట్లుగానే తన తర్వాతి సినిమా గీతా ఆర్ట్స్ కు చేయనుండగా.. ఇందులో హీరోగా యంగ్ హీరో శర్వానంద్ నటిస్తాడని తెలుస్తోంది. పరశురామ్ చెప్పిన స్టోరీ లైన్ కి అల్లు అరవింద్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. శర్వా కూడా సై అనేశాడట. దీంతో పూర్తి స్క్రిప్ట్ రాసుకునేందుకు సిద్ధమవుతున్నాడు పరశురామ్. శ్రీరస్తు శుభమస్తు సక్సెస్ సాధించిన ఊపుతో తన తర్వాతి ప్రాజెక్టుపై మరిన్ని జాగ్రత్తలు తీసుకోబోతున్నానని తెలుస్తోంది.

అయితే.. శర్వాతో సినిమా అని మాత్రం పరశురాం పైకి చెప్పడం లేదు. ఇప్పుడే ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడ్డం కరెక్ట్ కాదని.. ప్రొడ్యూసర్ హీరోల నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేవరకూ ఆగాలని భావిస్తున్నాడట. మళ్లీ ఫ్యామిలీ జోనర్ లో ఈ దర్శకుడు సినిమా చేస్తాడట. ఇప్పటికే శతమానం భవతి అంటూ ఫ్యామిలీ మూవీ చేస్తున్న శర్వాకి.. వచ్చే ఏడాది మరో కుటుంబ కథాచిత్రం కూడా పడబోతోందన్న మాట.