Begin typing your search above and press return to search.

నేను చెప్పేమాట ఇదే .. రాసి పెట్టుకోండి: శర్వానంద్

By:  Tupaki Desk   |   28 Feb 2022 2:59 AM GMT
నేను చెప్పేమాట ఇదే .. రాసి పెట్టుకోండి: శర్వానంద్
X
శర్వానంద్ హీరోగా దర్శకుడు కిశోర్ తిరుమల రూపొందించిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. ఈ వేదికపై శర్వానంద్ మాట్లాడుతూ .. "ఇంతమంది .. ఇంతదూరం వచ్చి చాలా చాలా ప్రేమను చూపిస్తున్నారు. ఇంత ఓపికగా ఇంతసేపు ఉన్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నాను. సుకుమార్ గారికి నేను చాలా పెద్ద అభిమానిని.

అలాంటి ఆయన ఈ రోజున ఇక్కడికి వచ్చి మమ్మల్ని విష్ చేశారు. అలాగే నేను కీర్తిగారికి కూడా ఫ్యాన్ ని. ఆమె ఇక్కడకి రావడాన్ని నేను చాలా గొప్పగా ఫీలవుతున్నాను.

సాయిపల్లవిగారి గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. నేను తనని ఒక నటిగానో .. పెద్డ స్టార్ గానో చూడను. సాయిపల్లవి మనసుతో చూస్తుంది .. మనసుతో మాట్లాడుతుంది. అందుకే ఆమెకి అందరూ అంతగా కనెక్ట్ అవుతారు. నిజంగా తను నాకు మంచి ఫ్రెండ్. మనసుతో మాట్లాడితే ఇలా కనెక్ట్ అవుతారా అనే విషయం ఈ రోజున మీ అందరినీ ఇలా చూస్తుంటే అర్థమవుతోంది. ఆమెలా మనసుతో మాట్లాడటం నేను కూడా నేర్చుకుంటాను. అందరినీ తనవాళ్లుగా భావిస్తూ అంతటి ప్రేమను ఆమె ఇవ్వగలదు.  

అందుకే ఆమె మా అందరినీ .. మీ అందరినీ కూడా సాధించుకుంది. నిజానికి ఆమెకి వంట్లో బాగోలేకపోయినా ముందుగా ఇచ్చిన మాట మేరకు వచ్చారు. ముఖ్యంగా మాట్లాడవలసింది ఈ సినిమాకి ప్రాణం పోసిన మా దేవిశ్రీ ప్రసాద్ గారి గురించి. ఆయన రియల్ రాక్ స్టార్. నా సినిమాలో ఆయన ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ ఇచ్చారు. మంచి సినిమా తీస్తే హిట్ కావొచ్చు. కానీ అది బ్లాక్ బస్టర్ హిట్ కావాలంటే పాటలు సూపర్ హిట్ అయ్యుండాలి. అలాంటి బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇచ్చినందుకు ఆయనకి థ్యాంక్స్ చెబుతున్నాను.

రాధికగారు .. ఖుష్బూ గారు .. ఊర్వశి గారు వంటి సీనియర్ నటీమణులతో కలిసి పనిచేసే ఛాన్స్ వచ్చింది. వారందరికీ పేరు పేరున థ్యాంక్స్. నిర్మాత సుధాకర్ గారితో గల సాన్నిహిత్యమే నేను ఈ సినిమాను చేయడానికి ముఖ్యమైన కారణం. ఒక్కటి మాత్రం కచ్చితంగా చెప్పగలను .. ఇది నా కెరియర్ లో బెస్ట్ సినిమా అవుతుంది .. రాసి పెట్టుకోండి. నా సినిమాల నుంచి ఏవైతే ఇన్ని రోజులు మిస్సయ్యారో అవన్నీ ఇచ్చేద్దామనే ఈ సినిమాను చేశాను.

 రష్మికకి పాన్ ఇండియా క్రేజ్ వచ్చినప్పటికీ, ఎప్పుడూ నవ్వుతూ తగ్గే ఉంటుంది. మార్చి 4న వస్తున్న ఈ సినిమాను థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి" అని చెప్పుకొచ్చాడు.