Begin typing your search above and press return to search.

హీరో అవ్వ‌డమే ఒక‌ బోన‌స్‌!!

By:  Tupaki Desk   |   6 March 2019 4:24 AM GMT
హీరో అవ్వ‌డమే ఒక‌ బోన‌స్‌!!
X
మ‌నిషిగా పుట్ట‌డ‌మే బోన‌స్ అనుకుంటే.. హీరో అవ్వ‌డం డ‌బుల్ బోన‌స్!! టాలీవుడ్ కి చెందిన ఓ ప్ర‌ముఖుడు ఓ సంద‌ర్భంలో చెప్పిన‌ మాట ఇది. హీరోకి ఉండే క్రేజు అలాంటిది. జ‌న్మ ఒక్క‌టే అనుకుంటే అందులో హీరో అయ్యే అవ‌కాశం కూడా ఒక్క‌టే. అందుకే ఫేజ్ 3 యూత్ చాలా మంది వ‌న్ ఫిలిం వండ‌ర్ అయినా అవ్వాల‌నుకుంటారు. న‌వ‌త‌రం హీరోల్లో ట్యాలెంటెడ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న శ‌ర్వానంద్ అస‌లు హీరో అవ్వాల‌నుకున్నాడా? అంటే.. ఆరంభం ఆ ఆలోచ‌న లేక‌పోయినా.. త‌న‌కు ఉన్న ఫేజ్‌3 క‌నెక్ష‌న్‌ దృష్ట్యా హీరో అవ్వాల‌నుకున్నాడు. అయ్యాడు. అటుపై కెరీర్ ప‌రంగా కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా నెమ్మదిగా నిల‌దొక్కుకోగ‌లిగాడు. ఫ్యామిలీ ఆడియెన్ మ‌న‌సు దోచిన యువ‌హీరోగా గుర్తింపు ద‌క్కించుకున్నాడు.

గ‌మ్యం, మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు - ర‌న్ రాజా ర‌న్ వంటి హిట్ చిత్రాలు ఉన్నాయి. శ‌త‌మానం భ‌వ‌తి కెరీర్ కి కీల‌క‌మైన ట‌ర్నింగ్ పాయింట్. పాతిక సినిమాల హీరో అయ్యాడు ఇప్ప‌టికే. ప్ర‌స్తుతం కెరీర్ 27వ సినిమాలో న‌టించేస్తున్నాడు. శ‌ర్వా 27 ఇప్ప‌టికే సెట్స్ లో ఉంది. సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా లో కాస్త ఏజ్డ్ డాన్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. అలాగే పాతికేళ్ల యువ‌కుడిగానూ క‌నిపిస్తాడ‌ట‌. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా పూర్త‌వుతోంది.

మెగాప‌వ‌ర్‌ స్టార్ రామ్ చ‌ర‌ణ్ - బ‌న్ని వంటి స్టార్ల‌కు శ‌ర్వానంద్ క్లోజ్ ఫ్రెండ్. మెగా అండ‌తో హీరో ఆరంభ‌మై.. అటుపై స్వ‌యంకృషితో ఎదిగిన హీరోగానూ శ‌ర్వానంద్ కి గుర్తింపు ఉంది. తొలి నుంచి ఇమేజ్ తో ప‌ని లేకుండా ప్ర‌యోగాల బాట‌లోనే వెళ్లాడు.. సెన్సిబిలిటీస్ తో ఫ్యామిలీ హీరోగా ఎలివేట్ అయ్యాడు. హీరో అవ్వ‌డ‌మే బోన‌స్ అనుకుంటే.. ఒడిదుడుకుల ప్ర‌పంచంలో 27 సినిమాల హీరోగా కెరీర్ సాగించ‌డం అంటే ఆషామాషీ కానేకాదు. మిగ‌తాదంతా అడిష‌న్ బోన‌స్ అనుకోవాలి. మ‌ళ్లీ ఒకే ఒక్క హిట్టుతో కెరీర్ మ‌రో ఐదారేళ్లు సాగిపోతుంది. హీరో అవ్వ‌డ‌మే ఒక బోన‌స్ అనుకుంటే.. అద‌న‌పు లైఫ్ అంతా బిగ్ బోన‌స్ అనే అనుకోవాలి. నేడు శ‌ర్వానంద్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు.