Begin typing your search above and press return to search.

శర్వాకి ఫుట్ బాల్, సాయిపల్లవికి స్టెతస్కోప్!

By:  Tupaki Desk   |   1 Aug 2018 10:29 AM GMT
శర్వాకి ఫుట్ బాల్, సాయిపల్లవికి స్టెతస్కోప్!
X
సినిమాల్లో కొత్తదనం కావాలి అంటే డైరెక్టర్లు స్టొరీతో పాటు హీరో - హీరోయిన్ల ప్రొఫెషన్ మీద ఫోకస్ పెడతారు. హీరో ఐటీ అతే ఒకలా స్టొరీ రన్ అవుతుంది.. అల్లాటప్పా టపోరి అయితే ఇంకోలా. మరి 'పడి పడి లేచెను మనసు' కోసం దర్శకుడు హను రాఘవపుడి కూడా ఇలానే ఇంట్రెస్టింగ్ గా ప్లాన్ చేసినట్టున్నాడు.

తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమాలో హీరో శర్వానంద్ ఓ ఫుట్ బాల్ ప్లేయర్ లా కనిపిస్తాడట. అంటే అర్జెంటినా ఫార్వర్డ్ ఆటగాడు లియోనెల్ మెస్సిలా ఫుట్ బాల్ ను ప్రత్యర్థులకు దొరక్కుండా చాకచక్యంగా గోల్ పోస్ట్ లోకి పంపి గోల్స్ చేస్తుంటాడేమో. మరోవైపు హీరోయిన్ సాయిపల్లవి ఒక డాక్టర్ లా కనిపిస్తుందట. మరి ఆ ఫుట్ బాల్ కి ఈ స్టెతస్కోప్ కి ఎక్కడ లింక్ కుదిరిందో ఎలా అది ప్రేమగా మారుతుందో అనేది చూడాలంటే సినిమా రిలీజ్ వరకూ వెయిట్ చేయక తప్పదు.

ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే గతంలో ఈ సినిమా హీరో - హీరోయిన్ల ప్రొఫెషన్ల గురించి ఇంట్రెస్టింగ్ వార్తలు వచ్చాయి. సాయిపల్లవి ఫుట్ బాల్ ప్లేయర్ పాత్రలో - శర్వా క్రికెట్ ప్లేయర్ రోల్ లో నటిస్తారని అన్నారు. కానీ అదంతా ఇప్పుడు లేదు.. ఉష్ కాకి. కొత్త అప్డేట్ ప్రకారం శర్వాకి ఫుట్ బాల్ - సాయిపల్లవికి స్టెతస్కోప్ అని మీరు కూడా ఫిక్స్ అయిపోండి.