Begin typing your search above and press return to search.

శర్వా - సాయి పల్లవి రొమాంటిక్‌ మూడ్‌

By:  Tupaki Desk   |   7 Nov 2018 4:28 AM GMT
శర్వా - సాయి పల్లవి రొమాంటిక్‌ మూడ్‌
X
యంగ్‌ హీరో శర్వానంద్‌ - క్రేజీ బ్యూటీ సాయిపల్లవి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘పడిపడి లేచే మనసు’. యూత్‌ ఫుల్‌ లవ్‌ ఎంటర్‌ టైనర్‌ గా రూపొందుతున్న ఈ చిత్రంకు హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రేమ కథను విభిన్న రీతిలో చూపించగల ప్రతిభ ఉన్న హను రాఘవపూడి ఈ చిత్రంలో కూడా శర్వానంద్‌ - సాయి పల్లవిల మద్య మంచి రొమాంటిక్‌ లవ్‌ ట్రాక్‌ ను నడిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ మరియు టీజర్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రంలో శర్వానంద్‌ ఫుట్‌ బాల్‌ ప్లేయర్‌ గా కనిపించనుండగా - సాయి పల్లవి డాక్టర్‌ గా కనిపించబోతుంది.

షూటింగ్‌ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రంను వచ్చే నెలలో విడుదల చేయబోతున్నారు. తాజాగా దీపావళి సందర్బంగా ఈ చిత్రంలో ఒక రొమాంటిక్‌ స్టిల్‌ ను ప్రేక్షకులకు కానుకగా విడుదల చేశారు. సినిమాలోని టైటిల్‌ సాంగ్‌ ను ఈనెల 12న విడుదల చేయబోతున్నట్లుగా కూడా ఈ సందర్బంగా ప్రకటించారు. చిత్ర యూనిట్‌ సభ్యులు విడుదల చేసిన దీపావళి స్పెషల్‌ పోస్టర్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. శర్వా - సాయి పల్లవి రొమాంటిక్‌ మూడ్‌ లో, అందమైన లొకేషన్‌ లో ఉండటంతో యూత్‌ ఆడియన్స్‌ ఫిదా అవుతున్నారు. అచ్చు ఇలాంటి స్టిల్‌ ‘ఫిదా’ చిత్రం సమయంలో దర్శకుడు శేఖర్‌ కమ్ముల విడుదల చేశాడు. వరుణ్‌ తేజ్‌ - సాయి పల్లవి లు మంచులో ఇలాంటి ఫోజ్‌ లోనే రొమాంటిక్‌ గా ఉన్న స్టిల్‌ బాగా ఫేమస్‌ అయ్యింది. అలాగే ఈ స్టిల్‌ కూడా సినిమాలో ఆకర్షణ ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.