Begin typing your search above and press return to search.

సాయి పల్లవిని పిక్నిక్ కి తీసుకెళ్లడానికి శర్వా - శేష్ చెప్పిన టెక్నిక్స్..!

By:  Tupaki Desk   |   5 Nov 2022 10:31 AM GMT
సాయి పల్లవిని పిక్నిక్ కి తీసుకెళ్లడానికి శర్వా - శేష్ చెప్పిన టెక్నిక్స్..!
X
నటసింహం నందమూరి బాలకృష్ణ 'అన్ స్టాపబుల్ 2' టాక్ షోతో ఓటీటీ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నారు. ఆహా కోసం ఆయన హోస్టుగా వ్యవహరిస్తున్న ఈ టాక్ షో రెండో సీజన్ సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. గత ఎపిసోడ్ లో యువ హీరోలు విశ్వక్ సేన్ మరియు సిద్ధు జొన్నలగడ్డ సందడి చేయగా.. లేటెస్ట్ ఎపిసోడ్ కి మరో ఇద్దరు టాలీవుడ్ యంగ్ హీరోలు శర్వానంద్ మరియు అడివి శేష్ హాజరయ్యారు.

శర్వా మరియు శేష్ తన సినీ కెరీర్ గురించి వ్యక్తిగత జీవితంలో జరిగిన విషయాల గురించి ఈ షోలో వెల్లడించారు. బాలయ్య సైతం యువ హీరోలతో కలిసిపోయి సరదా సంభాషణ సాగించారు. ఈ సందర్భగా ఓ గేమ్ లో భాగంగా శేష్ - శర్వాలపై బాలకృష్ణ పలు ఆసక్తికర ప్రశ్నలు సంధించారు. 'ఏ టెక్నిక్ వాడి సాయి పల్లవి ని పిక్నిక్ కి తీసుకెళ్లవచ్చు?' అనే ప్రశ్నపై ఇద్దరు కుర్ర హీరోలు సమాధానాలు ఇచ్చారు.

''సాయి పల్లవి ని గుడికి వెళ్దాం అంటే వచ్చేస్తది. ఇద్దరం కలిసి చాలా గుడులు తిరిగాం'' అని శర్వానంద్ చెప్పారు. దీంతో గుళ్లకు వెళ్లి శాంతులు చేయించుకున్నారా? అని బాలయ్య సరదాగా అన్నారు. శేష్ మాత్రం సాయి పల్లవి కి పోయెట్రీ వినిపించి ప్లాట్ చేయొచ్చని.. కొంచం డీప్ గా ఫీల్ తో ఉండే కవితలు చెబితే చాలని చెప్పాడు. ఈ సందర్భంగా బాలయ్య ఓ హిందీ కవిత చెప్పి.. తన వంతుగా సాయి పల్లవికి చెప్పమని నవ్వులు పూయించారు.

అలానే 'సినిమాల్లో ఎవరెవరిని కిస్ చేసావ్? ఏ హీరోయిన్ ను కిస్ చేయాలనుకుంటున్నావ్? ఎవరితో అసలు కిస్ వద్దు అనుకుంటున్నావ్?' అనే ప్రశ్నలకు శేష్ స్పందిస్తూ.. నేను ఫస్ట్ కిస్ 'క్షణం' సినిమాలో అదాశర్మకు పెట్టాను. చివరిగా 'హిట్ 2' సినిమా కోసం మీనాక్షి చౌదరికి ముద్దు పెట్టానని చెప్పాడు. అలానే కత్రినా కైఫ్ ను కిస్ చేయాలని ఉందని.. పూజా హెగ్డే కు ముద్దు పెట్టడం ఇష్టం లేదని అన్నాడు. దీనికి శర్వా స్పందిస్తూ 'నేను ఏ అమ్మాయి కిస్ ఇస్తానన్నా వద్దని అనను సార్' అంటూ నవ్వుతూ బదులిచ్చాడు.

ఈ షోలో అడివి శేష్ తన రిలేషన్ షిప్ స్టేటస్ గురించి తెలిపారు. గతంలో ఒక అమ్మాయితో డేటింగ్ చేసానని.. కానీ ఇప్పుడు రిలేషన్ కట్ అయిందని.. ఇప్పుడు తాను సింగిల్ అని వెల్లడించాడు. సినీ పరిశ్రమలో శర్వానంద్ లాంటి ఇంకా పెళ్లి కాని హీరోలు చాలామంది ఉన్నారని.. పెద్దవాళ్ళ పెళ్లి అయ్యాకే మనం చేసుకోవాలి (నవ్వుతూ..) అని శేష్ అన్నాడు. 'నేను ప్రభాస్ అన్న పేరు చెప్పుకొని తిరుగుతుంటే.. నువ్ నా పేరు చెప్పుకొని తిరుగుతున్నావా?' అని శర్వా ఫన్నీగా రియాక్ట్ అయ్యారు.

'మహా సముద్రం' సినిమాలో హీరోయిన్ ప్రస్తావన తీసుకొచ్చిన బాలయ్య.. 'అదితిరావ్ హైదరీని సినిమాలో నువ్వు కొట్టేస్తే.. బయట సిద్దార్థ కొట్టేశాడా?' అని అన్నాడు. బయట వారిద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు సర్.. నేనూ సోషల్ మీడయాలో సిద్దు పెట్టిన పోస్ట్ చూశా అని శర్వా తెలిపారు. తన తొలి సినిమాని కర్మ సిద్ధాంతం నేపథ్యంలో తీశానని 'కర్మ' అనే టైటిల్ పెడితే.. ప్రేక్షకులు దాన్ని తిట్టు అనుకుని సినిమాకు వెళ్లలేదని చెప్పి శేష్ అందరినీ నవ్వించారు.

'అన్ స్టాపబుల్ విత్ NBK' సీజన్-2 టాక్ షోలో బాలయ్యతో కలిసి శర్వా నంద్ - అడవి శేష్ చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.