Begin typing your search above and press return to search.

శర్వాకు ఒక మంచి జోడీ ఈమె

By:  Tupaki Desk   |   26 Feb 2022 1:30 AM GMT
శర్వాకు ఒక మంచి జోడీ ఈమె
X
యంగ్‌ హీరో శర్వా నంద్‌ కు హీరోగా ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా తెరకెక్కింది. కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో చిత్ర యూనిట్‌ సభ్యులు వచ్చే వారం రిలీజ్ కు సిద్దం చేస్తున్నారు. ఈ సినిమా లో శర్వానంద్‌ కు జోడీగా రష్మిక మందన్నా నటించడం వల్ల అంచనాలు మరింతగా పెరిగాయి అనడంలో సందేహం లేదు.

పుష్ప సినిమా తర్వాత రష్మిక మందన్నా క్రేజ్ అమాంతం పెరిగింది. ఆ క్రేజ్ ఈ సినిమాకు ఖచ్చితంగా వర్కౌట్‌ అవుతుంది. శర్వానంద్‌ వరుస ప్లాప్‌ లతో కాస్త లో గా ఉన్నాడు. ఈ సమయంలో శర్వానంద్‌ కి శ్రీవల్లి రష్మిక మందన్నా వల్ల ఈ సినిమా తో ఖచ్చితంగా మంచి విజయం దక్కే అవకాశాలు ఉన్నాయంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఈ సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

సినిమా ఫస్ట్‌ లుక్ విడుదల అయినప్పటి నుండి కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా వీరు సినిమా ను రూపొందించారని ఇటీవల టీజర్ విడుదలతో క్లారిటీ వచ్చింది. ముఖ్యంగా శర్వానంద్‌ మరియు రష్మిక మందన్నా కాంబో సన్నివేశాలు హైలైట్‌ అవుతాయనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఇద్దరి కాంబో సన్నివేశాలు అందమైన దృశ్యం కావ్యం ను తలపిస్తాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

శర్వానంద్‌ చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తాడు.. ఆయనకు లేడీ ఫాలోయింగ్‌ చాలా ఉంటుంది. ఆయన కు జోడీగా చాలా తక్కువ మంది అమ్మాయిలు మాత్రమే సెట్‌ అవుతారు. ఆ తక్కువ మంది అమ్మాయిల్లో రష్మిక మందన్నా ఈ సినిమా తో చేరిందనే టాక్‌ వస్తుంది. అందమైన ఈ జోడీ సినిమా విజయంలో కీలక పాత్ర పోషిస్తారని.. అభిమానులను ఆకట్టుకుంటారని అంటున్నారు.

రష్మిక మందన్నా వరుస విజయాలతో దూసుకు పోతుంది. కనుక ఈ సినిమా తో ఆమె స్థాయి మరింతగా పెరుగుతుందనే నమ్మకం ను అంతా వ్యక్తం చేస్తున్నారు. శర్వానంద్ మరియు రష్మికల జోడీ ముందు ముందు మరిన్ని సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి. శర్వానంద్‌ కు ఒక మంచి జోడీగా రష్మిక ఈ సినిమా తర్వాత నిలుస్తుందని విశ్లేషకులు అంటున్నారు. శర్వానంద్‌ మరియు రష్మికల కాంబో లో మళ్లీ మళ్లీ వచ్చేలా ఈ సినిమా విజయాన్ని సొంతం చేసుకుంటుందా అనేది చూడాలి.