Begin typing your search above and press return to search.

భానుమతికి మహానుభావుడి సర్టిఫికేట్

By:  Tupaki Desk   |   17 Dec 2018 11:38 AM IST
భానుమతికి మహానుభావుడి సర్టిఫికేట్
X
కొన్ని నెలల క్రితం ఓ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో హీరో నాగ శౌర్య సాయిపల్లవితో కణం షూటింగ్ లో ఎదురుకున్న అనుభవాల గురించి ఈగోతో ఉండే తన మనస్తత్వం గురించి బాహాటంగానే విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తర్వాత దాని ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో సాయి పల్లవి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం జరిగినప్పటికీ శౌర్య తన కామెంట్స్ కే కట్టుబడ్డాడు. దాని ముందు కూడా ఎంసిఎ టైంలో నానితో కూడా ఏవో ఇష్యూస్ ఉన్నాయని కొన్ని కథనాలు వచ్చాయి. నాని సైతం వాటిని కొట్టిపారేసాడు.

ఏడాది గ్యాప్ తర్వాత ఇదే విషయంగా సాయి పల్లవి చేస్తున్న పడి పడి లేచే మనసు హీరో శర్వానంద్ దీని గురించిన పూర్తి క్లారిటీ ఇస్తున్నాడు. అసలెలాంటి ఈగో లేని హీరొయిన్ సాయి పల్లవిని ప్రతిదీ డీటెయిల్ద్ గా చదువుకుని చక్కని సహజమైన నటనను ప్రదర్శిస్తుందని కితాబు ఇచ్చేసాడు. అంటే కాదు అంత న్యాచురల్ గా తాను సైతం నటించలేనని చెప్పి షాక్ ఇచ్చాడు. వేర్వేరు మాధ్యమాల్లో తన గురించి విన్నవన్నీ అబద్దమని అర్థమైపోయిందని ప్రత్యక్షంగా తనతో కలిసి నటించాక అనుమానాలన్నీ తీరిపోయాయని శర్వా క్లారిటీ ఇచ్చేసాడు.

మొత్తానికి నాగ శౌర్య చెప్పిన మాటలకు పూర్తి విరుద్ధమైన అభిప్రాయాన్ని వ్యక్తపరించిన శర్వానంద్ మాటలు విని సాయి పల్లవి ఫ్యాన్స్ ఆనందంలో ఉన్నారు. డిసెంబర్ 21న విడుదల కానున్న పడి పడి లేచే మనసు మీద యూనిట్ చాలా నమ్మకంతో ఉంది. ఫీల్ గుడ్ లవ్ స్టొరీతో పాటు ఎవరూ ఊహించని ఎమోషనల్ రైడ్ ఇందులో ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే ఆడియోతో పాటు ట్రైలర్ మంచి స్పందన దక్కించుకున్నాయి.