Begin typing your search above and press return to search.

'మహాసముద్రం' చిత్రాన్ని ముగించేశారు..!!

By:  Tupaki Desk   |   9 July 2021 6:39 AM GMT
మహాసముద్రం చిత్రాన్ని ముగించేశారు..!!
X
టాలెంటెడ్ హీరోలు శర్వానంద్ - 'బొమ్మరిల్లు' సిద్ధార్థ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ''మహాసముద్రం''. 'Rx 100' ఫేమ్ అజయ్ భూపతి ఈ ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ని తెరకెక్కిస్తున్నారు. టాలెంటెడ్ బ్యూటీ అదితి రావు హైదరి - గార్జియస్ అను ఇమ్మాన్యుయేల్ లు ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇటీవలే తిరిగి షూటింగ్ ప్రారంభించిన మేకర్స్.. గత కొన్ని రోజులుగా ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో 'మహాసముద్రం' సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ను విడుదల చేసింది.

విశాఖపట్నం బ్యాక్ డ్రాప్ లో ఉన్న ఈ పోస్టర్ లో శర్వా - సిద్దార్థ్ ఇద్దరూ నవ్వుతూ కనిపిస్తున్నారు. షూట్ ఎంత ఆహ్లాదకరమైన వాతావరణంలో పూర్తయిందో చెప్పడానికి ఈ పోస్టర్ ను ఉదాహరణగా పేర్కొన్నారు చిత్ర బృందం. 'మహాసముద్రం' నుంచి ఇప్పటి వరకు విడుదలైన శర్వానంద్ - సిద్ధార్థ్ - అదితి రావు హైదరి - అను ఇమ్మాన్యుయేల్ - జగపతి బాబు - రావు రమేష్ మరియు గరుడ రామ్ పోస్టర్స్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్లు కాకుండా, మేకర్స్ మరే ఇతర ప్రమోషనల్ కంటెంట్ ని రిలీజ్ చేయలేదు. అయినప్పటికీ ఈ సినిమాపై బజ్ ఏర్పడింది.

దర్శకుడు అజయ్ భూపతి డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్పబడుతున్న 'మహాసముద్రం' స్క్రిప్టులో అన్ని పాత్రలకు ప్రాముఖ్యత ఉండేలా రాసుకున్నట్లు తెలుస్తోంది. రెగ్యులర్ మాస్ సినిమా కానప్పటికీ.. కమర్షియల్ చిత్రానికి అవసరమైన అన్ని అంశాలను జోడిస్తూ ఈ వైవిధ్యమైన చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటైన 'మహా సముద్రం' థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. త్వరలోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం 'మహాసముద్రం' చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కిశోర్ గరికపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. చైతన్య భరద్వాజ్ దీనికి సంగీతం సమకూరుస్తుండగా.. రాజ్ తోటా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ వర్క్ చేస్తుండగా.. కొల్లా అవినాష్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేస్తున్నారు.