Begin typing your search above and press return to search.

కోన మెడికల్‌ థ్రిల్లర్‌ కు ఓకే చెప్పిన శర్వా

By:  Tupaki Desk   |   4 Jan 2021 1:00 PM IST
కోన మెడికల్‌ థ్రిల్లర్‌ కు ఓకే చెప్పిన శర్వా
X
యంగ్‌ హీరో శర్వానంద్‌ సక్సెస్‌ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా ఆఫర్లు దక్కించుకుంటున్నాడు. ఇప్పటికే ఈయన శ్రీకారం సినిమా చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నాడు. ఇక ఆర్‌ఎక్స్‌ 100 సినిమా దర్శకుడు అజయ్‌ భూపతి దర్శకత్వంలో మహా సముద్రం అనే సినిమాను చేస్తున్నాడు. ఇదే సమయంలో ఆడళ్లు మీకు జోహార్లు అనే సినిమాను కూడా ఈయన చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. మూడు సినిమాలు కూడా ఇదే ఏడాది విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ మూడు సినిమాలు మాత్రమే కాకుండా మరో సినిమాను కూడా శర్వానంద్‌ కమిట్‌ అయ్యాడని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ప్రముఖ రచయిత కోన వెంకట్‌ రాసిన ఒక మెడికల్‌ థ్రిల్లర్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ కథతో శర్వానంద్‌ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు దర్శకత్వం ఎవరు అనే విషయంలో క్లారిటీ రాలేదు. కాని కోన ఈ సినిమాను నిర్మించబోతున్నాడట. సాయి ధరమ్‌ తేజ్ వద్దకు మొదట ఈ కథ వెళ్లిందనే వార్తలు కూడా వస్తున్నాయి. కొన్ని కారణాల వల్ల అది శర్వానంద్ వద్దకు వచ్చింది. ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌ తో కోన వెంకట్‌ రాసిన ఈ కథ శర్వానంద్ కు బాగా నచ్చడంతో వెంటనే నటించేందుకు ఓకే చెప్పాడని మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. గత కొన్నాళ్లుగా శర్వానంద్‌ కు సక్సెస్ కరువయ్యింది. గత ఏడాది జానుతో వచ్చినా కూడా పెద్దగా యూజ్ లేకుండా పోయింది. మరి ఈ ఏడాదిలో అయినా శర్వాకు సక్సెస్ దక్కేనా చూడాలి.