Begin typing your search above and press return to search.

అట్లీ దర్శకత్వంలో సూపర్ స్టార్ డ్యూయల్ రోల్...!

By:  Tupaki Desk   |   23 Oct 2020 5:30 PM GMT
అట్లీ దర్శకత్వంలో సూపర్ స్టార్ డ్యూయల్ రోల్...!
X
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ 'జీరో'(2018) సినిమా ప్లాప్ అయిన తర్వాత మరో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయలేదు. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ''పఠాన్'' అనే సినిమా చేయనున్నాడు. 'వార్' డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ రూపొందించనున్న ఈ చిత్రాన్ని త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. దీని తర్వాత బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్‌ కుమార్ హిరాణీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు షారూక్. ఇదే క్రమంలో తమిళ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ కుమార్ తో ఓ సినిమా కమిట్ అయ్యాడు కింగ్‌ ఖాన్. 'రాజా రాణి' 'పోలీసోడు' 'అదిరింది' 'విజిల్' వంటి వరుస విజయాలు అందుకున్న అట్లీ బాలీవుడ్ సూపర్ స్టార్ కోసం ఓ పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేసినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ తో రెడీగా ఉన్న అట్లీ ఈ చిత్రంలో షారుక్ ఖాన్ తో ద్విపాత్రాభినయం చేయించనున్నాడట. అది కూడా తండ్రీ కొడుకులుగా అని తెలుస్తోంది. తండ్రి రా(RAW) ఏజెంట్‌ గా.. కొడుకు గ్యాంగ్‌ స్టర్‌ గా కనిపిస్తారట. కొడుకుని వెంటాడే తండ్రి నేపథ్యంలో రూపొందనున్న ఈ మూవీ టేకింగ్ చాలా ఇంట్రెస్టింగ్‌ గా ఉండబోతుందట. షారుఖ్ కు డ్యూయల్ రోల్ ప్లే చేయడం కొత్తేమీ కాదు. 'డూప్లికేట్' 'డాన్' 'ఫ్యాన్' వంటి సినిమాల్లో కింగ్‌ ఖాన్ ద్విపాత్రాభినయం చేసి మెప్పించాడు. ఇప్పుడు మరోసారి రెండు పాత్రల్లో కనిపించి అలరించనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రారంభించే అవకాశం ఉంది.