Begin typing your search above and press return to search.

కెవ్వు కేక బ్యూటీ అదిరిపోయింది

By:  Tupaki Desk   |   1 May 2018 5:26 AM GMT
కెవ్వు కేక బ్యూటీ అదిరిపోయింది
X
పైన కనిపిస్తోన్న బ్యూటీని ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది కదా?. 2013 లో వచ్చిన అల్లరి నరేష్ కెవ్వు కేక సినిమాలో కనిపించిన చిన్నదే ఈ బికినీ బ్యూటీ. అందులో హీరోయిన్ గా నటించిన షర్మిలా మాండ్రేనే చాలా వరకు గ్లామర్ లో మంచి ఆదరణ దక్కించుకుంది. కానీ అల్లరోడి సినిమాల్లో కనిపించిన బ్యూటీలకు స్టార్ డమ్ ఎక్కువ రాదు అనే తరహాలోనే ఈ బ్యూటీ పరిస్థితి కూడా మారిపోయింది.

కన్నడ సినిమాల ద్వారా మంచి క్రేజ్ అందుకున్న షర్మిల తమిళ్ హిందీని కూడా టచ్ చేసింది. అవకాశాలు ఎన్ని వచ్చినప్పటికీ ఈ సుందరి అనుకున్నంత రేంజ్ లో ఇతర భాషల్లో నెగ్గలేకపోయింది. ఇకపోతే అమ్మడు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో టచ్ లోనే ఉంటుంది. తనకు సంబందించిన పోటోలను షేర్ చేస్తూ ఆకర్షిస్తుంటుంది. రీసెంట్ గా తన క్రొయేషియా వెకేషన్ నుండి పోస్ట్ చేసిన ఒక ఫొటో కూడా నెటిజన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటోంది.

బికినిలో హాట్ గా ఫోజిస్తూ సెల్ఫీ దిగింది. క్లివేజ్ షోతో ఒక్కసారిగా గుండె పట్టుకునేలా చేసింది అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా ఆమె సేద తీరుతున్నట్లు కనిపిస్తుండడాన్ని చూసి ఆమె కలలో నేను వస్తే బావుండని మరికొంత మంది సరదాగా కామెంట్ చేయడం హైలెట్ గా నిలుస్తోంది. ఇక షర్మిల ఇలా తన అందాలతో ఎప్పటికప్పుడు కుర్రకారును తనవైపు తిప్పుకుంటోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఒక బాలీవుడ్ సినిమాతో బిజీగా ఉంది.