Begin typing your search above and press return to search.

సొట్ట మొహం సిన్న‌మ్మ‌లు ఈ సంపుడేంది?

By:  Tupaki Desk   |   8 July 2022 3:30 PM GMT
సొట్ట మొహం సిన్న‌మ్మ‌లు ఈ సంపుడేంది?
X
శ‌ర్మా సిస్ట‌ర్స్ సంపుడు గురించి కొత్త‌గా చెప్పేదేం ఉంది? సోష‌ల్ మీడియాల్లో హీట్ పుట్టించ‌డం శ‌ర్మా గాళ్స్ కి నిత్య వ్యాప‌కం. నిరంత‌ర ఫోటోషూట్లు వీడియో షూట్ల‌తో కుర్ర‌కారులో విర‌హం పెంచ‌డ‌మే ధ్యేయంగా సిస్ట‌ర్స్ చెల‌రేగిపోవ‌డం చూస్తున్న‌దే.

తాజాగా శ‌ర్మా గాళ్స్ షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోషూట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. నేహా శ‌ర్మ టినీ ఫ్లోరల్ టాప్ .. పొట్టి మిడ్డీ ధ‌రించి సంథింగ్ స్పెష‌ల్ గా క‌నిపిస్తోంది. దానికి పూర్తి భిన్నంగా డ‌ఫెట్ డెనిమ్ చినుగుల జీన్స్ లో ఐషా శ‌ర్మ ర‌ఫ్ గా అల్ట్రా పోష్ గా క‌నిపిస్తోంది. ఈ ఫోటోల‌కు అభిమానుల నుంచి అదిరిపోయే స్పంద‌న‌లు వ‌స్తున్నాయి. శ‌ర్మాగాళ్స్ టూ హాట్ అంటూ కొంద‌రు ఫ్యాన్స్ కామెంట్లు చేయగా.. బ్యూటిఫుల్ ల‌వ్ లీ అంటూ హార్ట్ ఈమోజీల‌ను అభిమానులు షేర్ చేస్తున్నారు. ఒక అభిమాని అయితే కాస్త కొంటెగా.. ''సొట్ట మొహం సిన్న‌మ్మ‌లు ఈ సంపుడేంది?'' అంటూ వ్యాఖ్యానించాడు.

శ‌ర్మా గాళ్స్ టీజింగ్ యాటిట్యూడ్ పైనా కొంద‌రు ప్ర‌శ్న‌ల‌కు కురిపించారు. మొత్తానికి శ‌ర్మా సిస్ట‌ర్స్ ట్ర‌య‌ల్ ఒక రేంజులో వ‌ర్క‌వుటైంది. సామాజిక మాధ్య‌మాల్లో క్లిక్ లు లైక్ ల‌తో హోరెత్తింది. ఇక పాపుల‌ర్ హాలీవుడ్ రియాలిటీ షో స్ఫూర్తితో శ‌ర్మా గాళ్స్ త‌మ రియ‌ల్ లైఫ్ వీడియోల‌ను షేర్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. షైనింగ్ విత్ ది శ‌ర్మాస్ పేరుతో ఇవి వైర‌ల్ గా మారుతున్నాయి.

నేహాశ‌ర్మ చిరుత గాళ్ గా పాపుల‌ర్. త‌న సోద‌రి ఐషా అథ్లెట్ కం మోడ‌ల్. న‌టిగా ఇప్పుడిప్పుడే రాణిస్తోంది. ఇటీవ‌లే జాన్ అబ్ర‌హాం స‌త్య‌మేవ జ‌య‌తే చిత్రంలో న‌టించింది. త‌దుప‌రి బిగ్ బ్యాన‌ర్స్ చిత్రాల‌కు సంత‌కాలు చేసేందుకు వెయిటింగ్ లో ఉంద‌ని తెలిసింది. ఇప్ప‌టికే త‌న‌కు సోష‌ల్ మీడియాల్లో అసాధార‌ణ ఫాలోయింగ్ ఏర్ప‌డ‌డంతో అది కాస్తా వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల ఆదాయంగా మారుతోంది. ప్ర‌స్తుతానికి సినిమాల‌తో కంటే ప్ర‌క‌ట‌న‌ల‌తోనే బాగా ఆర్జిస్తోంది ఈ బ్యూటీ. మునుముందు స్టార్ గా త‌న‌ని తాను ఎలివేట్ చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.

శ‌ర్మా గాళ్స్ బీహార్ -భ‌గ‌ల్ పూర్ కి చెందిన ప్ర‌ముఖ కాంగ్రెస్ నాయ‌కుడి కుమార్తెలు అన్న సంగ‌తి తెలిసిందే. మోడ‌లింగ్ న‌ట‌నా రంగంపై మ‌క్కువ‌తో ముంబై ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌వేశించారు. అక్క‌డ కెరీర్ కోసం చాలా కాలంగా త‌పిస్తూనే ఉన్నారు ఈ అంద‌గ‌త్తెలు.

కానీ ఏదీ అంత ఈజీగా సాధ్య‌ప‌డ‌డం లేదు. ప‌రిశ్ర‌మ‌లో అవ‌కాశాలు రావాలంటే చాలా కోణాల్లో నిరూపించుకోవాలి. స్టార్ అవ్వాలంటే ఇంకా చాలా కావాలి. చ‌క్క‌ని న‌ట‌నాభిన‌యం అంత‌కుమించి బ్రాండింగ్ అవ‌స‌రం. దానికి మించి ల‌క్ కూడా క‌లిసి రావాలి. ఇన్ని ఉంటేనే ఈరోజుల్లో ఇంత పోటీలో దూసుకెళ్ల‌గ‌ల‌రు. ఇటీవ‌ల శ‌ర్మా సిస్ట‌ర్స్ ప్లానింగ్ లో వైవిధ్యంగా దూసుకెళుతున్నారు. ఇవి అవ‌కాశాలు క్రియేట్ చేస్తున్నాయ‌ని తెలుస్తోంది.