Begin typing your search above and press return to search.

అప్పటి హీరో.. ఇప్పటి క్యారెక్టర్ ఆర్టిస్టు చేతిలో 22 సినిమాలు!

By:  Tupaki Desk   |   29 Sept 2022 10:10 AM IST
అప్పటి హీరో.. ఇప్పటి క్యారెక్టర్ ఆర్టిస్టు చేతిలో 22 సినిమాలు!
X
చిత్ర పరిశ్రమలో కనిపించే సిత్రాలు అన్ని ఇన్ని కావు. కొందరు ఎంత కష్టపడినా.. ఫలితం ఉండదు. మరికొందరు పెద్దగా శ్రమించకున్నా వారి సుడి మామూలుగా ఉండదు. అందంగా ఉన్నా అవకాశాలు రాకపోవటం.. కేవలం సుడితో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయేటోళ్లు ఎంతోమంది.

అయితే.. సినిమా రంగంలో మిగిలిన అంశాలు ఎలా ఉన్నా.. విషయాల్ని మనం ఎలా చూస్తామన్నది కూడా కీ పాయింట్ గా చెబుతుంటారు.

ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి.. స్టార్ హీరోలుగా పేరు ప్రఖ్యాతులు ఉన్న వారు సైతం.. మారిన కాలానికి తగ్గట్లు.. మీద పడిన వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ.. ఎవర్ గ్రీన్ అన్నట్లుగా ఉంటారు. టాలీవుడ్ లో జగపతి బాబు.. తమిళంలో శరత్ కుమార్ ఆ కోవలోకే వస్తారు.

ఒకప్పుడు యాక్షన్ హీరోగా పేరున్న శరత్ కుమార్.. పెరిగిన తన వయసుకు తగ్గట్లుగా.. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్ని వరుస పెట్టి చేసుకుంటూ పోతున్నారు.

భాష.. బ్యానర్.. జోనర్.. ఇవేమీ చూసుకోకుండా.. వచ్చిన అవకాశాల్లో తనకు గుర్తింపు తెచ్చే వాటిని ఎంపిక చేసుకుంటూ.. ఊపిరి పీల్చుకోలేనంత బిజీగా ఉంటున్నారు. ఓవైపు వెండితెర.. మరోవైపు ఓటీటీల్లోనూ పని చేసేందుకు ఏ మాత్రం వెనుకాడని ఆయన చేతిలో ఇప్పుడు ఏకంగా 22 సినిమాలు ఉన్నాయంటే ఆయన ఎంత బిజీ అన్నది అర్థం చేసుకోవచ్చు.

ఇప్పటికి కొన్ని ప్రాజెక్టుల్లో హీరో పాత్రల్ని చేసే ఆయన.. అదే సమయంలో విలన్ గా వణికిస్తూ.. క్యారెక్టర్ ఆర్టిస్టు మాదిరి ఒదిగిపోతూ దూసుకెళ్లిపోతున్న సీనియర్ నటుడు ఆయన ఒక్కరే అని చెప్పాలి. ఒకప్పుడు తాను స్టార్ హీరో అన్నది పట్టించుకోకుండా.. పరిస్థితులకు తగ్గట్లుగా తనను తాను మార్చేసుకున్న వైనం చూసినప్పుడు.. ఎంతో మందికి దారి చూపే నటుడిగా కనిపిస్తారు శరత్ కుమార్.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.