Begin typing your search above and press return to search.

అప్పుడు పవన్! ఇప్పుడు విజయ్!!

By:  Tupaki Desk   |   3 May 2018 6:20 PM GMT
అప్పుడు పవన్! ఇప్పుడు విజయ్!!
X
సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలకు హీరోలకు ఉండే రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్క సినిమా హిట్ అయితే చాలు స్నేహ బంధం పెరిగిపోతుంది. అంతే కాకుండా వరుసగా ఆ కాంబినేషన్ లో సినిమాలు రావడం మనం చూస్తూనే ఉంటాం. ఇక సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ నిర్మాతలతో సన్నిహితంగా ఉండేది చాలా తక్కువ. అయితే శరత్ మరార్ మాత్రం ఆయనకు చాలా క్లోజ్ అని అందరికి తెలిసిందే.

ఇండస్ట్రీలోకి రాకముందు నుంచి శరత్ మరార్ పవన్ కళ్యాణ్ మంచి స్నేహితులు. అయితే పవన్ తో చేసిన రెండు సినిమాలు అనుకున్నంత రేంజ్ లో హిట్ అవ్వలేదు. సర్దార్ గబ్బర్ సింగ్ - కాటమరాయుడు ఫెయిల్ అయ్యాయి. కాటమరాయుడు ఓ విధంగా కొంచెం నష్టాల నుంచి కాపాడిందనే చెప్పాలి. ఇక పవన్ సినిమాలకు దూరంగా ఉండడంతో శరత్ మరార్ తో కూడా దూరం పెరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ సారి ఆయన కోలీవుడ్ లో పవన్ కళ్యాణ్ తరహాలో క్రేజ్ అందుకునే విజయ్ ని నమ్ముకున్నట్లు తెలుస్తోంది.

విజయ్ గతంలో చేసిన మెర్సల్ సినిమాను శరత్ మరార్ తెలుగులో రిలీజ్ చేసుకున్నాడు. ఆ సినిమా పరవాలేదు అనే విధంగా తెలుగులో మంచి వసూళ్లను అందుకుంది. ఇక విజయ్ తో డైరెక్ట్ గా ఒక సినిమా చేయాలని శరత్ మరార్ ఒప్పందం చేసుకున్నాడట. వారి మధ్య స్నేహం కూడా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. విజయ్ కూడా టాలీవుడ్ లో తన మార్కెట్ ను పెంచుకోవాలని చూస్తున్నాడు. అందుకోసం శరత్ మరార్ తో ఒక సినిమాను నిర్మించి తెలుగులో కూడా గ్రాండ్ గా రిలీజ్ చెయ్యాలని అనుకుంటున్నాడు.