Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ చించేశాడంటున్న ప్రొడ్యూస‌ర్‌

By:  Tupaki Desk   |   8 Jan 2016 5:30 PM GMT
ప‌వ‌న్ చించేశాడంటున్న ప్రొడ్యూస‌ర్‌
X
ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరో సినిమా నిర్మిస్తున్నందుకు ఇప్ప‌టికే చాలాసార్లు ఎగ్జైట్ అయ్యాడు ప్రొడ్యూస‌ర్ శ‌ర‌త్ మ‌రార్‌. తాజాగా మ‌రోసారి ఆయ‌న త‌న ఆనందాన్ని పంచుకున్నాడు. ఈ రోజు షూటింగులో ప‌వ‌న్ ప‌డ్డ క‌ష్టం.. ఆయ‌న పెర్ఫామెన్స్ చూసి మెస్మ‌రైజ్ అయిపోయిన శ‌ర‌త్‌.. చాలా ఎగ్జైట్ మెంట్ తో పెట్టిన ట్వీట్లు చూసి ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందంతో ఉబ్బిత‌బ్బిబ్బయిపోతున్నారు.

‘‘స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ సెట్స్ లో ఓ గొప్ప రోజును ముగించా. ఈ ప్రాజెక్టులో భాగ‌మైనందుకు అదృష్ట‌వంతుణ్ని. ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు అంటూ ఓ ట్వీట్ చేశాడు శ‌ర‌త్ మ‌రార్‌. ఆ త‌ర్వాత ఇంకో ట్వీట్లో ప‌వ‌న్ ఎంత క‌ష్ట‌ప‌డ‌తాడో ఇప్పుడు తెలుస్తోంది. త‌న అభిమానులు త‌న నుంచి ఏం ఆశిస్తారో ప‌వ‌న్ కు బాగా తెలుసు. స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ ను ఓ కంప్లీట్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందించ‌డానికి ప‌వ‌న్ చేయాల్సిందంతా చేస్తున్నాడు’’ అని పేర్కొన్నాడు.

ఈ ట్వీట్లు చూశాక ప‌వ‌న్ అభిమానుల్లో ఉత్సాహం ఉర‌క‌లేస్తోంది. స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ త‌మ ఆకాంక్ష‌ల‌కు త‌గ్గ‌ట్లే తెర‌కెక్కుతోంద‌ని.. ప‌వ‌న్ త‌న‌దైన శైలిలో ఎంట‌ర్ టైన్ చేయ‌డానికి క‌ష్ట‌ప‌డుతున్నాడ‌ని తెలిసి ఈ సినిమాపై మ‌రింత అంచ‌నాలు పెంచుకుంటున్నారు. ఏప్రిల్ 8న స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న సంగ‌తి తెలిసిందే.