Begin typing your search above and press return to search.

డబుల్ హ్యాండ్సమ్ అంటున్న మరార్

By:  Tupaki Desk   |   18 March 2017 5:55 PM GMT
డబుల్ హ్యాండ్సమ్ అంటున్న మరార్
X
చాలా ఏళ్ళ నుండి మెగా ఫ్యామిలీతో ట్రావెల్ చేస్తూ.. ఇప్పుడు నార్త్ స్టార్ ఎంటర్టయిన్మెంట్ అంటూ సొంతంగా ఒక సంస్థను స్థాపించి పవన్ కళ్యాణ్‌ తో సినిమాలు తీస్తున్నాడు నిర్మాత శరత్ మరార్. ''కాటమరాయుడు''కు కూడా అన్నీ ఆయనే. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్టాడిన మరార్.. పవన్ ను డబుల్ హ్యాండ్సమ్ అంటూ ఆకాశానికి ఎత్తేశాడు.

''నాకు తెలుగులో మాట్లాడమని క్లియర్ ఆర్డర్లు వచ్చేశాయి. ఈ సినిమా చేద్దాం అని డిసైడ్ చేశాక.. చాలా పాజిటివ్స్ జరిగాయ్. కాటమరాయుడు టైటిల్.. డాలీ దర్శకుడిగా రావడం.. అనూప్ మ్యూజిక్ ఇవ్వడం.. వేమా రెడ్డి.. ఆకుల శివ.. ఇలా అందరూ ప్లస్సయ్యారు'' అంటూ చెప్పారు ఈ నిర్మాత. ఇక పవన్ గురించి మాట్లాడుతూ.. ''ప్రతీరోజూ ఆయన చూపించే కమిట్మెంట్ అద్భుతం. ఆయన ఎంత బిజీగా ఉన్నా కూడా.. సినిమా కోసం ఆయన చూపించే క్లారిటీ కమిట్మెంట్ అద్భుతం. హార్వార్డ్ కు వెళ్ళినప్పుడు మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు కళ్యాణ్‌ గారు. ఇక పంచెకట్టులో అయితే డబుల్ హ్యాండ్సమ్ గా ఉన్నారు. మూడు సినిమాలు నాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను'' అంటూ ముగించారు.

అయితే తెలుగులోనే మాట్లాడతాను అంటూ మొదలెట్టిన శరత్ మరార్.. మధ్యలో ఇంగ్లీషు అందుకుని.. చివరకు హిందీలో ముగించారు. అదో తుత్తి.