Begin typing your search above and press return to search.

పవన్ సన్నిహితుడు హిట్టు కొడతాడా?

By:  Tupaki Desk   |   14 March 2018 5:55 AM GMT
పవన్ సన్నిహితుడు హిట్టు కొడతాడా?
X
సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి వారైనా బౌన్స్ బ్యాక్ అవుతారు అనే విషయం అందరికి తెలిసిందే. ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా తట్టుకొని నిలబడటానికి దైర్యం చాలానే కావాలి. అయితే ఎవరి పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ నిర్మాత పరిస్థితి మాత్రం చాలా క్లిష్టంగా ఉంటుంది. కొంచెం నష్టాలూ వచ్చినా కూడా జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. కోట్లు పెట్టి తీసిన సినిమా నష్టపోతే నిర్మాత ఏ విధంగాను కోలుకోలేదు. కానీ పవన్ కళ్యాణ్ సన్నిహితుడు మాత్రం విజయం కోసం చాలా ప్రయత్నిస్తున్నారు.

గత ఏడాది పవన్ కళ్యాణ్ - కాటమరాయుడు సినిమాను నిర్మించిన శరత్ మరార్ ఊహించని విధంగా నష్టాలను ఎదుర్కొన్నారు. సినిమా ఏ తరహాలోను లాభం అందించలేదు. అయితే ఆయన భారీ సినిమాల వైపు వెళ్లకుండా ఇప్పుడు కేవలం డబ్బింగ్ తరహా చిత్రాల వైపు దృష్టి పెడుతున్నారు. కోలీవుడ్ లో తెరకెక్కిన నయనతార కర్తవ్యం సినిమాను తెలుగులో శరత్ మరార్ డబ్ చేస్తున్నారు. అసలైతే ఈ సినిమా గత ఏడాది రిలీజ్ కావలి. కానీ అనుకొని కారణాల వల్ల ఈ నెల 16న థియేటర్స్ లోకి రాబోతోంది.

ఆ సినిమాలతో కొంత వరకైనా కాటమరాయుడు నష్టాలను రికవర్ చేసుకుందామని శరత్ మరార్ చాలా ప్రయత్నాలు చేస్తున్నడని తెలుస్తోంది. నయనతారకు కోలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది. తెలుగులో కూడా ఉండొచ్చు కానీ సినిమా మాన ఆడియెన్స్ కి ఎంతవరకు నచ్చుతుందనేది అసలు అనుమానం. ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నారు. మరి సినిమా శరత్ మరార్ కి ఎంత వరకు లాభాలను అందిస్తుందో చూడాలి.