Begin typing your search above and press return to search.

సీనియర్ హీరో స్నేక్ మ్యాన్ అయ్యాడే

By:  Tupaki Desk   |   31 Jan 2018 12:44 PM IST
సీనియర్ హీరో స్నేక్ మ్యాన్ అయ్యాడే
X
కోలీవుడ్ సీనియర్ హీరో శరత్ కుమార్ ఒకప్పుడు తనదైన శైలిలో సినిమాలను చేసి ఎన్నో బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్నాడు. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ సినిమాల సంఖ్యను ఎందుకో తగ్గించేశారు. ఫుల్ కథానాయకుడిగా కాకుండా సౌత్ లో కీలకమైన రోల్స్ చేస్తూ తన నెక్స్ట్ ఇన్నింగ్స్ ని ఒక లెవెల్లో మెయింటేన్ చేస్తూ వస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే చాలా రోజుల తరువాత శరత్ కుమార్ ఒక డిఫెరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

తన కెరీర్ లోనే తొలి సారిగా అత్యంత భారీ బడ్జెట్ చిత్రంలో శరత్ కుమార్ నటించబోతున్నారు. ఫుల్ ఫాంటసీ మూవీగా తెరకెక్కబోయే "పాంబన్" అనే ఆ సినిమా చెన్నై లో ఈ రోజు స్టార్ట్ అయ్యింది. ఇక ఫస్ట్ లుక్స్ ని కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. పోస్టర్స్ ని చూస్తుంటే కెరీర్ లో మొదటి సారి సీనియర్ హీరో పెద్ద ప్రయోగమే చేస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తిగా స్నేక్ మ్యాన్ గా శరత్ కుమార్ కనిపిస్తున్నాడు. ఆ ఫొటోలు ప్రస్తుతం సౌత్ లో చాలా వైరల్ గా మారాయి.

సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ ఏడాది ఎండింగ్ లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇక శరత్ కుమార్ తెలుగులో చివరగా బోయపాటి దర్శకత్వంలో వచ్చిన జయ జానకి నాయక సినిమాలో కనిపించాడు. అలాగే రానున్న నా పేరు సూర్య - భరత్ అనే నేను అలాగే సాక్ష్యం సినిమాలో కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నాడు.