Begin typing your search above and press return to search.

అఫీషియల్: ప్రభాస్ హీరోయిన్ ఆమే..

By:  Tupaki Desk   |   15 Aug 2017 4:01 PM IST
అఫీషియల్: ప్రభాస్ హీరోయిన్ ఆమే..
X
తొలిసారిగా ప్రభాస్ ప్రక్కన తదుపరి చేయబోయే ఒక హీరోయిన్ పై పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చేసింది. 'బాహుబలి' సినిమాతో తరువాత ప్రభాస్ 'సాహో' సినిమాతో రానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అసలు మన కండలవీరుడి పక్కన నటించేది ఎవరూ అంటూ అందరూ ఎదురు చూస్తున్నారు. రకరకాల పేర్లు తరువాత బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్దా కపూర్ పేరు ప్రథమంగా వినిపించింది. ఇప్పుడు ఆ పేరే కన్ఫామ్ అయ్యింది.

తొలిసారిగా ఈ సినిమా హీరోయిన్ గురించి ప్రకటించిన యువి క్రియేషన్స్ సంస్థ.. సాహో ఫ్యామిలీకి బ్యూటిఫుల్ శ్రద్దా కపూర్ కు స్వాగతం పలుకుతున్నాం అంటూ ట్వీట్ చేసింది. దీనితో ఇక సాహో కోసం హీరోయిన్ ను వెతకడం పూర్తయినట్లే. పరిణీతి చోప్రా నుండి అనుష్క వరకు.. కత్రినా కైఫ్‌ నుండి ఆలియా భట్ వరకు.. ఇలా ప్రభాస్ కోసం చాలా పేర్లను పరిశీలించి చివరకు ఈమెను ఓకే చేశారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందట.

ఇకపోతే ఈ సినిమా కోసం శ్రద్దా కపూర్ కోసం ఏకంగా 8 కోట్లు పేమెంట్ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సినిమాను మూడు బాషల్లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి.. మూడు బాషల్లోనూ ప్రమోషన్ కూడా చేయాలి కాబట్టి.. శ్రద్దా ఆ రేంజు రేటు డిమాండ్ చేసిందట. సుజిత్ డైరక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేష్.. చుంకీ పాండే వంటి వారు విలన్లుగా చేస్తున్నారు. అది సంగతి.