Begin typing your search above and press return to search.

ఇండ‌స్ట్రీ పెద్ద‌లు మారాల‌న్న ఫేడ‌వుట్ బ్యూటీ

By:  Tupaki Desk   |   21 July 2020 9:45 AM IST
ఇండ‌స్ట్రీ పెద్ద‌లు మారాల‌న్న ఫేడ‌వుట్ బ్యూటీ
X
టాలీవుడ్ లో అగ్ర క‌థానాయిక‌గా ఎద‌గాల‌నుకున్న ముంబై ర్యాంప్ వాక్ బ్యూటీ శ్ర‌ద్ధా దాస్ ఆశించిన‌ది ద‌క్కించుకోలేక‌పోయిన సంగ‌తి తెలిసిందే. ఆరంభం కొన్ని సినిమాల్లో క‌థానాయిక‌గా అవ‌కాశాలు అందుకున్నా.. కాల‌క్ర‌మంలో అంత‌గా ప్రాధాన్య‌త లేని పాత్ర‌లే త‌న‌ని వ‌రించాయి. ఆర్య2 చిత్రంలో వ్యాంపు త‌ర‌హా పాత్ర‌లోనే చేసింది. ఓ తెలుగు యువ‌హీరోతో ప్రేమాయ‌ణం సాగించిందని ప‌బ్లుల్లో షికార్లు చేసింద‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం సాగింది. చివ‌రికి ప్రేమ వైఫ‌ల్యంపైనా ర‌క‌ర‌కాల క‌థ‌నాలొచ్చాయి. అటుపై కెరీర్ ఏమంత వెల‌గ‌లేదు. ఇటీవ‌లే `గుంటూర్ టాకీస్` చిత్రంలో వేడెక్కించే పెర్ఫామెన్స్ తో రౌడీ రాణిగా అద‌ర‌గొట్టినా ఎందుక‌నో ఆ త‌ర్వాత స‌రైన అవ‌కాశాలేవీ రాలేదు.

గ‌త కొంత‌కాలంగా సోష‌ల్ మీడియాల్లో ఈ అమ్మ‌డు జ‌రంత‌ స్పీడ్ చూపిస్తోంది. నిరంత‌రం హీట్ పెంచే ఫోటోల్ని షేర్ చేస్తూ అటెన్ష‌న్ డ్రా చేస్తోంది. అయినా ఏం ప్ర‌యోజ‌నం? ఆశించిన ఆ ఒక్క ఛాన్స్ అయితే ద‌క్క‌డం లేదు. తాజాగా శ్ర‌ద్ధా దాస్ .. నెపోటిజం గురించి ప‌రిశ్ర‌మ‌లో గాడ్ ఫాద‌ర్ లేక‌పోతే త‌లెత్తే ఇబ్బందుల గురించి ఎలాంటి దాప‌రికం లేకుండా మాట్లాడేసింది. సుశాంత్ సింగ్ మ‌ర‌ణానంత‌రం స్వ‌ప‌క్షం.. స్వాభిమానం అనే టాపిక్ పై శ్ర‌ద్ధా కూడా తాను సైతం అంటూ త‌న‌కు తెలిసిన‌వి ఇలా చెప్పుకొచ్చింది.

ఇండ‌స్ట్రీలో ఎలాంటి నేప‌థ్యం లేకుండా ప్ర‌వేశిస్తే ఆ త‌ర్వాత చాలా స‌మస్య‌ల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని తెలిపింది. తెలుగు హిందీ బెంగాళీ భాష‌ల్లో న‌టించిన ఈ భామ‌కు ప్ర‌తిచోటా స‌వాళ్లు ఎదుర‌య్యాయ‌ట‌. తనలాంటి నటీనటులు ఒక సినిమాలో ఒక చిన్న పాత్రను పొందటానికి వేలాది ఆడిషన్లు ఇవ్వవలసి ఉంటుంది. ఎంత చేసినా చివ‌రికి సినీనేపథ్యం ఉన్న వ్యక్తికే ఆఫ‌ర్ వెళుతుంది. అత‌డి సిబ్బంది ఆ ప‌ని చేసి పెడ‌తారు. ఒకానొక సంద‌ర్భంలో ఓ చిన్న పాత్ర కోసం త‌న‌ను వెయ్యి సార్లు ఆడిష‌న్స్ చేశార‌ట‌.

నేపథ్యం లేని చాలా మంది నటీనటులు ఎవ‌రినీ క‌ల‌వ‌లేరు. స్టార్ ఫిల్మ్ ‌మేకర్స్ ‌ను చేరుకోలేరు. ఆడిష‌న్స్ ఇవ్వ‌లేరు అని తెలిపింది శ్ర‌ద్ధా. బ్యాక్ గ్రౌండ్ ఉంటే మాత్రం మొదటి రోజే ఈ రంగంలో రెడ్ కార్పెట్ స్వాగతం లభిస్తుంది. వెంట సైన్యం ఉంటారు .. వాళ్లే అవ‌కాశాలు తెస్తారు అని తెలిపింది. పరిశ్రమ పెద్దలు క‌నీసం ఇప్ప‌టికి అయినా మార‌తారేమో చూడాలి. శ్ర‌మించే బ‌య‌టి ట్యాలెంటుకు అవ‌కాశాలిస్తార‌నే ఆశిద్ధాం అంటూ ముక్తాయించింది.