Begin typing your search above and press return to search.

#టూ హాట్‌.. బ‌రిలో దిగుతూనే మెంట‌లెక్కించిన‌ స్టార్ కిడ్

By:  Tupaki Desk   |   30 Jan 2021 10:56 AM IST
#టూ హాట్‌.. బ‌రిలో దిగుతూనే మెంట‌లెక్కించిన‌ స్టార్ కిడ్
X
బాలీవుడ్ లో న‌ట‌వార‌సురాళ్ల వెల్లువ ఇప్ప‌ట్లో ఆగేట్టు లేదు. ఓవైపు న‌ట‌వార‌స‌త్వం బంధు ప్రీతిపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నా.. వ‌చ్చేవాళ్లు వ‌స్తూనే ఉన్నారు. జాన్వీ క‌పూర్.. అన‌న్య పాండే .. సారా అలీఖాన్ లాంటి భామ‌లు ఇప్ప‌టికే అగ్ర క‌థానాయిక‌లుగా ఎదిగేస్తున్నారు. ఖుషీక‌పూర్.. సుహానా ఖాన్ బ‌రిలో దిగేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఈలోగానే మ‌రో స్టార్ కిడ్ స‌డెన్ గా దూసుకొస్తోంది. బాలీవుడ్ జెన్-నెక్స్ట్ స్టార్ గా ల‌క్ చెక్ చేసుకునేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్నాన‌ని సిగ్న‌ల్ ఇచ్చేసింది. బాలీవుడ్ స్టార్ డాట‌ర్స్ పేర్ల‌లో ఎక్కువ‌గా వైర‌ల్ అవుతున్న షాన‌యా క‌పూర్ ఇక నట‌నారంగంలో స‌త్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది.

నిన్న‌టికి నిన్న సుహానా- అన‌న్య‌ల‌తో క‌లిసి షానయ కపూర్ ఓ గ్రూప్ ఫోటోలో క‌వ్విస్తూ క‌నిపించింది. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో అద్భుతమైన ఫోటోలను పంచుకున్న షానయ తన జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇన్ స్టా అభిమానుల్ని టీజ్ చేసింది.

``ఒక పేజీని తిర‌గేస్తున్నా`` అంటూ వ్యాఖ్య‌ను జోడించింది షాన‌య‌. దాన‌ర్థం న‌టిగా ఆరంగేట్రం చేస్తోంద‌నే. షానయ తన ఫోటోషూట్ నుంచి హాటెస్ట్ స్టిల్స్ ని ఇన్ స్టాలో షేర్ చేయ‌గా అవి ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. వైట్ టాప్ ..చినుగుల బాగీ డెనిమ్ ‌లో స్టార్ కిడ్ మంట‌లు పుట్టించింది. అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి చీర‌ప్ చేస్తూ `పెద్ద ఎత్తుగడలు వేస్తున్నావ్‌!` అంటూ వ్యాఖ్యానించింది. షానయ కజిన్ ఖుషీ కపూర్ సంతోషాన్ని వ్య‌క్తం చేయ‌గా... రియా కపూర్ .. హర్షవర్ధన్ కపూర్ .. అనిల్ కపూర్ .. అలాగే స్నేహితులు అంజిని ధావన్ .. ఆలియా కశ్యప్ నుండి ప్ర‌శంస‌లు కురిసాయి. షానయ కోసం కపూర్ ఆరంగేట్రంపై కుటుంబ స‌భ్యులు ఆనందంగా ఉన్నారు.

షానయ కపూర్ ఎవరు? అంటే.. ఇంకా అంత‌గా ప‌రిచ‌యం లేని వారికి ప‌రిచ‌యం చేయాల్సిందే. నటుడు సంజయ్ కపూర్ - మహీప్ కపూర్ ల కుమార్తె షానయ కపూర్. ఆమె సోనమ్ .. జాన్వి.. ఖుషీ.. అర్జున్ లకు బంధువు. అనన్య పాండే .. సుహానా ఖాన్.. న‌వ్వ న‌వేళి లకు షాన‌య‌ మంచి స్నేహితురాలు. జాన్వీ న‌టించిన `గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్` చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా ప‌ని చేసింది.