Begin typing your search above and press return to search.

క్యూట్ ల‌వ్ లీ.. నెవ్వర్ బిఫోర్ అనిపించే భంగిమ‌

By:  Tupaki Desk   |   17 Jan 2021 12:56 PM GMT
క్యూట్ ల‌వ్ లీ.. నెవ్వర్ బిఫోర్ అనిపించే భంగిమ‌
X
క‌న్న‌డ బ్యూటీ శాన్వి శ్రీ‌వ‌త్సవ‌ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ల‌వ్ లీ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైంది. క్యూట్ లుక్స్ తో కుర్ర‌కారు గుండెల్ని ట‌చ్ చేసిన‌ శాన్వీ తొలి ప్ర‌య‌త్నం ఎంతో ప‌ద్ధ‌తిగా సాంప్ర‌దాయ బ‌ద్ధ‌మైన లుక్ తో క‌నిపించింది. అయితే అవ‌కాశాలు లేని క్ర‌మంలో విష్ణు స‌ర‌స‌న ఆర్జీవీ డైరెక్ష‌న్ లో చెల‌రేగి అందాల్ని ఆర‌బోసింది. అయినా టాలీవుడ్ లో ఆశించిన కెరీర్ ని ద‌క్కించుకోవ‌డంలో త‌డ‌బ‌డింది ఈ న‌వ‌త‌రం బ్యూటీ.

ఇటీవ‌ల అత‌డే `శ్రీ‌మ‌న్నారాయ‌ణ` చిత్రంలో నాయిక‌గా న‌టించి మెప్పించింది. ప్ర‌స్తుతం క‌న్న‌డ‌లో త్రిశూలం.. క‌స్తూరి అనే రెండు సినిమాల్లో న‌టిస్తోంది. ప‌నిలో ప‌నిగా సోష‌ల్ మీడియాల్లో త‌న ఫాలోయింగ్ ని ఏమాత్రం త‌గ్గ‌కుండా కాపాడుకునేందుకు నిరంత‌రం వేడెక్కించే ఫోటోషూట్ల‌తో ట‌చ్ లో ఉంటోంది.

శాన్వి తాజా ఫోటోషూట్ అభిమానుల్లోకి వైర‌ల్ గా దూసుకెళుతోంది. శాన్వీలో క్యూట్ నెస్ .. హాట్ అప్పియ‌రెన్స్ రెండూ పాజిటివ్ ప్రోటాన్ ఎన‌ర్జీ.. నెగెటివ్ ఎల‌క్ట్రాన్ ఎనర్జీతో మిక్స‌యిన‌ట్టుగా ఒక‌దానికొక‌టి క‌నెక్ట‌యిపోతుంటే యూత్ అదే ప‌నిగా ప‌రేషాన్ అయిపోతున్నారు. ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో నెవ్వ‌ర్ బిఫోర్ అనిపించేంత హాట్ ఫోటోషూట్ తో శాన్వీ అద‌ర‌గొట్టింది. క్యూట్ బ్యూటీ మ‌రీ ఇంత‌గా చెల‌రేగాకా ఛాన్సివ్వ‌క‌పోతారా? మ‌రోసారి టాలీవుడ్ ఈ అమ్మ‌డిని క‌నిక‌రిస్తుందేమో చూడాలి.