Begin typing your search above and press return to search.

వారెవ్వ.. వాటే హాట్!!

By:  Tupaki Desk   |   23 Jan 2018 4:28 PM GMT
వారెవ్వ.. వాటే హాట్!!
X
టాలీవుడ్ లో ఏ హీరోయిన్ ఎంట్రీ ఇచ్చినా మొదట సింపుల్ గానే కనిపిస్తారు అని అందరికి తెలిసిన విషయమే. అందంలో అయినా గ్లామర్ రోల్స్ లో అయినా కొంచెం కొంచెం అప్డేట్ అవుతుంటారు. ఇక ఓకె ఫ్యామిలీకి చెందిన హీరోయిన్స్ కూడా అప్పుడప్పుడు సినీ ఇండస్ట్రీలో కనిపిస్తుంటారు. అలాంటి వారిలో లవ్లీ సిస్టర్స్ శాన్వి అండ్ విదిశా ఉన్నారు. లవ్లీ సినిమాతో శాన్వి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది గాని ఎక్కువ రోజులు నిలబడలేదు.

ఇక అదే తరహాలో ఆమె సిస్టర్ విదిశా ఎంట్రీ ఇచ్చింది. అల్లరి నరేష్ అత్తిలి సత్తిబాబు సినిమా ద్వారా ఈమె తెలుగు తెరకు పరిచయం అయ్యింది. కానీ ఈమె మాత్రం హిట్టు అందుకోలేదు. శాన్వి రేంజ్ లో గుర్తింపు కూడా దక్కలేదు. ఆ తరువాత ఇద్దరు అక్కా చెల్లెల్లు కన్నడ ఇండస్ట్రీలోకి వెళ్లి అక్కడ మంచి అవకాశాలను అందుకున్నారు. శాన్వి ఎక్కువగా మంచి ఆఫర్స్ ని అందుకొంటోంది. కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. అయితే ఆమె సిస్టర్ మాత్రం తెలుగులో ఒక మంచి ఆఫర్ అందుకోవాలని చూస్తోందని శాన్వి చెబుతోంది.

ఇక శాన్వి రీసెంట్ గా రిలీజ్ చేసిన ఒక ఫొటో హాట్ టాపిక్ అయ్యింది. ముఖ్యంగా కన్నడ అభిమానులు ఆమె లుక్ చూసి స్టన్ అయిపోతున్నారు. పొట్టి దుస్తుల్లో అమ్మడు లెగ్స్ సొగసలును ఓ రేంజ్ లో ఆరబోసింది. లేలేత సొగసులు షాక్ ఇస్తున్నాయి అని ఆమె ఫాలోవర్స్ వారెవ్వ.. వాటే హాట్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఆ లుక్ టాలీవుడ్ లో కూడా వైరల్ అయితే ఎవరో ఒక హీరో అమ్మడికి ఛాన్స్ ఇవ్వడం పక్కా అనే చెప్పాలి. చూద్దాం ఆమె లక్ ఎలా ఉందో!!