Begin typing your search above and press return to search.

శాన్వి ఇంత షాక్ ఇచ్చిందేంటి!

By:  Tupaki Desk   |   11 Jan 2018 7:11 AM GMT
శాన్వి ఇంత షాక్ ఇచ్చిందేంటి!
X
సౌత్ లో కొంత మంది హీరోయిన్స్ ని చూస్తే హాలీవుడ్ భామలకు ఏ మాత్రం తీసిపోరు అనిపిస్తుంది. వారి సొగసులను చూపించే విధానంలో కొత్త కొత్తగా ప్రయోగాలు చేయడం అందరిని ఆకట్టుకుంటుంది. మొన్నటి వరకు ఫొటో షూట్స్ అంటే కేవలం సినిమా ఛాన్సుల కోసం చేసేవారు. కానీ ఇప్పుడు మ్యాగైజిన్ ల కోసం ఎక్కువగా ఇస్తున్నారు. అంతే కాకుండా అభిమానులను ఆకట్టుకునే విధంగా కూడా సోషల్ మీడియాలో అందంగా కనిపిస్తూ షాక్ ఇస్తున్నారు.

అదే తరహాలో లవ్లీ హీరోయిన్ శాన్వి కూడా ఘాటైన అందాలతో ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. అమ్మడు తెలుగులో నటించింది కొన్ని సినిమాల్లోనే అయినా చాలా వరకు తన అందంతోనే ఎక్కువగా ఆకర్షించింది. రిజల్ట్ తో సంబంధం లేకుండా కుర్రకారు మనసును దోచుకుంది. అయితే మొన్నటి వరకు ఈ బ్యూటీ కొంచెం లిమిట్ లోనే ఫొటో షూట్స్ లో కనిపించేది. కానీ రీసెంట్ గా ఇచ్చిన స్టిల్స్ లో గ్లామర్ గీత ను దాటేసింది అనిపిస్తోంది.


లో దుస్తులతో తన అందాలను కెమెరా ముందు ఉంచడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. శాన్వి చీరలో కనిపించినా గ్లామర్ డ్రెస్సుల్లో కనిపించినా తన రేంజ్ వరకు బాగానే ఉండేది. కానీ ఇప్పుడు ఇచ్చిన స్టిల్స్ ని చూస్తుంటే.. శాన్వి చాలా మారిపోయింది అని నెటిజన్స్ ఎవరికీ నచ్చినట్టు వారు కామెంట్స్ చేస్తున్నారు. లేలేత సోయగాలను ఎంత చూసినా తనివి తీరడం లేదనీ అంటున్నారు. ఇక ప్రస్తుతం శాన్వి కన్నడలో రెండు సినిమాలను చేస్తోంది.