Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: అందంతో చంపేసిందిగా

By:  Tupaki Desk   |   9 Nov 2017 7:03 AM GMT
ఫోటో స్టోరి: అందంతో చంపేసిందిగా
X

లవ్లీ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఉత్తర ప్రదేశ్ భామ శాన్వి శ్రీవాత్సవ. మొదటి సినిమాలో క్యూట్ గా కనిపించిన ఈ భామ అందంలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ను దక్కించుకొంది. పాతికేళ్ళు కూడా లేని ఈ అందమైన పిల్ల తెలుగులో అంతగా రాణించకపోయినా కన్నడ లో మాత్రం బాగానే పాపులర్ అవుతోంది. చివరగా తెలుగులో రౌడీ అనే సినిమాలో గ్లామరస్ గా కనిపించిన శాన్వి ఆ తర్వాత మళ్లీ ఇటువైపు చూడలేదు.

కానీ సోషల్ మీడియాలో మాత్రం తెలుగు ప్రేక్షకులను ఎప్పటికప్పుడు పలకరిస్తోంది. ఆ మధ్యలో ఏవైనా పండుగలు జరిగితే తెలుగులో అందరికి విషెస్ ని కూడా అందించింది. ఇకపోతే శాన్వి ఫొటో షూట్స్ తో ఎట్రా్ట్ చేస్తోంది. సాధారణంగా అమ్మడు ఎక్కువగా గ్లామర్ గా కనిపించడానికి ఇష్టపడడు కానీ లిమిట్స్ లో ఉండే ఫ్యాషన్ డ్రెస్సులను వేస్తూ కొత్తగా స్టైలిష్ గా కనిపించడానికి ట్రై చేస్తుంటోంది.

ఈ మధ్యనే అమ్మడు ఇచ్చిన ఒక ఫొటో స్టిల్స్ చాలా కొత్తగా ఉన్నాయి. సంప్రదాయాన్ని స్టయిలిష్ డ్రెస్సులలో కలిపేసి తన సోయగాలను వడ్డించింది. చీర కట్టులో జీన్స్ ని తగిలించేసి ఓ తరహా అందాన్ని చూపించేసిందిలే. మరి ఆ ఫొటో వైరల్ కాకుండా ఉంటుందా ? చూసినవారంతా చంపేసిందనేలా పాజిటివ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం శాన్వి కన్నడలో రెండు సినిమాలను తమిళ్ లో ఒక సినిమాను చేస్తోంది.