Begin typing your search above and press return to search.

చైనా లో మన హీరోయినే ప్రిన్సెస్

By:  Tupaki Desk   |   5 Oct 2017 4:47 AM GMT
చైనా లో మన హీరోయినే ప్రిన్సెస్
X
లవ్లీ సినిమాతో వెండితెరకు పరిచయమైన బ్యూటీ శాన్వి శ్రీవాస్తవ. తెలుగులో నటించింది నాలుగు సినిమాల్లోనే అయినా తన అందంతో అందరిని ఆకర్షించింది. కానీ సినిమాలు అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో అమ్మడి కన్నడ బాట పట్టింది. అక్కడ ఒక్క హిట్ తో వరుస విజయాలను అందుకోని బిజీ అయిపొయింది. మళ్లీ తెలుగు వైపు చూడలేదు.

కన్నడ సినిమాల వల్ల శాన్వికి అదృష్టం బాగానే కలిసి వచ్చింది. బాలీవుడ్ లో కూడా నటించలేదు కానీ ఏకంగా చైనీస్ టీవీ సిరీస్ లో ఛాన్సులను దక్కించుకుంది. ''ది డార్క్ లార్డ్'' వెబ్ సిరీస్ లో శాన్వి ఇండియన్ ప్రిన్సెస్ గా కనిపించబోతొంది. రీసెంట్ గా చిత్రీకరణకు సంబందించిన పోటోలను శాన్వి స్వయంగా రిలీజ్ చేసింది. ఈమె మహారాణి గెటప్ లో చాలా బావుందనే చెప్పాలి. ఆమె కాస్ట్యూమ్ డిజైనింగ్ కూడా చాలా బావుంది. సౌత్ లో ఎంతమంది టాప్ హీరోయిన్స్ ఉన్నా శాన్వికి అవకాశం దక్కిందంటే చాలా లక్కీ అంటున్నారు. పైగా ఈ పాత్రకు సన్నీ లియోన్ ను అనుకుని.. ఆ తరువాత శాన్వితో సెటిల్ అయ్యారట. మే బి.. సన్నీ అడిగినంత పైకం శాన్వి అడిగుండకపోవచ్చు. పైగా లుక్స్ వైజ్ శాన్వి సన్నీకంటే చాలా ఇండియన్ తరహాలోనే ఉంటుంది.

చైనీస్ టివి సిరీస్ లకు ఇంటర్ నేషనల్ లెవల్ లో మార్కెట్ ఉంటుంది. దీంతో శాన్వి ఇమేజ్ ఆ సిరీస్ తో పెరిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక హీరోయిన్ లావణ్య త్రిపాఠి - కమెడియన్ వెన్నల కిషోర్ ఆమెకు అభినందనలు తెలిపేశారు.