Begin typing your search above and press return to search.

మాస్టర్ పీస్‌ తో హీటెక్కిస్తున్న లవ్ లీ

By:  Tupaki Desk   |   21 Dec 2015 5:44 AM GMT
మాస్టర్ పీస్‌ తో హీటెక్కిస్తున్న లవ్ లీ
X
శాన్వి శ్రీవాస్తవ.. లవ్ లీ - అడ్డా చిత్రాలతో టాలీవుడ్ లో గుర్తింపు సంపాదించిన శాన్వి.. కన్నడ సినిమా రంగంలోకి స్పీడ్ గానే అడుగు పెట్టేసింది. టాలీవుడ్ - కోలీవుడ్ లలో ప్రూవ్ చేసుకోకుండా.. శాండల్ వుడ్ లో ఎంట్రీ అంత సరికాదనే సలహాలు చాలామందే ఇచ్చినా.. వాటిని పక్కన పెట్టేసి, దర్జాగా కన్నడ సినిమాల్లో చేసేస్తోంది. గతేడాది చంద్రలేఖ విడుదల కాగా, ఇఫ్పుడు భలే జోడి పేరుతో ఓ మూవీ రిలీజ్ కి సిద్ధమైంది.

ఈ రెండు కాకుండా.. డైరెక్టర్ ముంజ తీస్తున్న మాస్టర్ పీస్ అనే మూవీలో చేస్తోంది. "నేను ఈ సినిమా యాక్సెప్ట్ చేసినపుడు, ఇది కూడా ఓ సాధారణ చిత్రమే అనుకున్నా. అందుకే తెలుగు - తమిళ్ సినిమాలు చేస్తూ.. పెద్దగా దృష్టి పెట్టలేదు. కానీ కొన్నాళ్లు షూటింగ్ జరిగాక నేనెంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నానో అర్ధమైంది. సాధారణంగా చేసే రొమాంటిక్ మాత్రమే కాదు.. ఇందులో కామెడీ తోపాటు ఫుల్ లెంగ్త్ ఎంటర్ టెయిన్ మెంట్ రోల్ చేస్తున్నా. ఇంత పెద్ద ఆఫర్ ఇచ్చినందుకు డైరెక్టర్ కి థాంక్స్ చెబుతున్నాను."అంటోంది శాన్వి. ఈ మూవీ తెరకెక్కుతున్న తీరు చూస్తే.. బ్లాక్ బస్టర్ గ్యారంటీ అనే విషయం అర్ధమవుతోందని, రిజల్ట్ గురించి ఏమాత్రం టెన్షన్ పడని మూవీ ఇదని అంటోంది శాన్వి.

మాస్టర్ పీస్ మూవీతో తన కెరీర్ ఓ పది మెట్లు ఎక్కేస్తుందని ఆశలు పెట్టుకుంది శాన్వి శ్రీవాస్తవ. ఎందుకంటే.. ఈ మూవీ అప్ డేట్స్ బయటకు వచ్చిన తర్వాత.. అమ్మడికి ఆఫర్స్ తోపాటు.. పెర్ఫామెన్స్ గురించి ఎంక్వైరీలు కూడా ఎక్కవయిపోయాయిట. అరడజన్ సినిమా రిలీజ్ లు ఉన్న తనకు ప్రస్తుతం ఇలాంటి గుర్తింపు చాలా ముఖ్యం అంటోంది శాన్వి.