Begin typing your search above and press return to search.

లవ్లీ బ్యూటీకి ఛాన్సులు కావలెను!!

By:  Tupaki Desk   |   13 Feb 2018 2:30 AM GMT
లవ్లీ బ్యూటీకి ఛాన్సులు కావలెను!!
X
లవ్లీ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయిన భామ శాన్వి శ్రీవాస్తవ. ఆ సినిమాలో నటనతో మెప్పించడంతో వరుస అవకాశాలు బాగానే వచ్చాయి. అడ్డా.. రౌడీ.. ప్యార్ మే పడిపోయానే అంటూ తెలుగులో చకచకా 4 సినిమాలు చేసేసింది కానీ.. సక్సెస్ చిక్కకపోవడంతో.. టాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఈమెను పక్కన పెట్టేశారు.

ఆ తర్వాత శాండల్ వుడ్ కి జంప్ అయిపోయిన ఉత్తర ప్రదేశ్ బ్యూటీ శాన్వి శ్రీవాస్తవ.. అక్కడ కెరీర్ ను నెట్టుకొస్తోంది. ప్రస్తుతం ఈమె చేతిలో రెండు సినిమాలు ఉండగా.. మళ్లీ ఈమెను తెలుగులోకి తెచ్చేదెవరా అన్నదే అంతుచిక్కని ప్రశ్నగా మారిపోయింది. గతంలో గ్లామర్ ఎగ్జిబిషన్ కి అంతగా ప్రాధాన్యం ఇవ్వని ఈ బ్యూటీ.. ఇప్పుడు ఆ యాంగిల్ లో తన ట్యాలెంట్ బాగానే చూపిస్తోంది. రీసెంట్ గా చేసిన సినిమాల్లో నడుం ఒంపులను ప్రదర్శించడం.. మోడర్న్ వేర్ కు అబ్జెక్షన్స్ చెప్పకపోవడం వంటివి.. ఈమెకు కొత్తగా జత కలిసిన క్వాలిటీస్.

అయితే.. టాలీవుడ్ లో సెంటిమెంట్స్ కి ఉన్నంత ఇంపార్టెన్స్.. వాళ్ల ప్రతిభాపాటవాలకు అంతగా కనిపించదు. అంతగా అయితే ట్యాలెంటెడ్ బ్యూటీ అంటారు తప్పితే.. సినిమా ఛాన్సులను ఇచ్చేందుకు ఇష్టపడరు. కానీ ఇప్పుడు కొత్తగా కనిపిస్తున్న ఈ అడ్డా భామ.. మరోసారి కనుక తెలుగులో అవకాశం లభిస్తే మాత్రం.. టాలీవుడ్ లో పాగా వేసేందుకు గట్టిగానే ప్రిపేర్ అయిపోయింది.