Begin typing your search above and press return to search.

'షంషేరా' ట్రైల‌ర్ : స్వేచ్ఛ‌ని నీకు ఎవ‌రో ఇవ్వ‌రు..లాక్కోవాల్సిందే!

By:  Tupaki Desk   |   24 Jun 2022 8:56 AM GMT
షంషేరా ట్రైల‌ర్ : స్వేచ్ఛ‌ని నీకు ఎవ‌రో ఇవ్వ‌రు..లాక్కోవాల్సిందే!
X
టాలీవుడ్ లో భారీ స్థాయిలో సినిమాలు పోటీప‌డుతుంటే బాలీవుడ్ వాటి ముందు తేలిపోతూ వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో మ‌న సినిమాకు ధీటుగా కొంత త‌ర‌హా ఫాంటీసీ, పీరియాడిక్ మూవీస్ తో ప్రేక్ష‌కుల ముందుకు రావాల‌ని, స‌రికొత్త అనుభూతిని అందించాల‌ని బాలీవుడ్ హీరోలు, మేక‌ర్స్ గ‌త కొంత కాలంగా విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కొంత మంది ఇప్ప‌టికే ఈ విష‌యంలో ఫెయిల్ అయ్యారు. కొంత మంది భారీ సినిమాలో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు.

ఈ నేప‌థ్యంలో బాలీవుడ్ ల‌వ్ బాయ్ బీర్ క‌పూర్ రెండు క్రేజీ చిత్రాలతో దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించాల‌ని భావిస్తున్నాడు. ఆయ‌న న‌టిస్తున్న 'బ్ర‌హ్మాస్త్ర‌'టీజ‌ర్ ఇప్ప‌టికే విడుద‌లై మిశ్ర‌మ స్పంద‌న‌ని సొంతం చేసుకుంది. ఈ మూవీని సెప్టెంబ‌ర్ లో భారీ స్థాయిలో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. అలియా భ‌ట్ హీరోయిన్ గా అయాన్ ముఖ‌ర్జీ తెర‌కెక్కిస్తున్న ఈ మూవీకి ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే.

ఇదిలా వుంటే ర‌ణ్ బీర్ క‌పూర్ మ‌రో పీరియిడిక్ యాక్ష‌న్ డ్రామా 'షంషేరా'తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. 1871 నేప‌థ్యంలో ఈ మూవీని బ్రిటీష్ కాలం నాటి పీరియాడిక్ డ్రామాగా తెర‌కెక్కించారు. క‌ర‌ణ్ మ‌ల్హోత్ర ద‌ర్శ‌క‌త్వంలో య‌ష్ రాజ్ ఫిలింస్ అధినేత ఆదిత్య చోప్రా ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో నిర్మించారు. బ్యాడ్ మెన్ సంజ‌య్ ద‌త్ కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ ని ఇటీవ‌ల మేక‌ర్స్ విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే.
అంత‌కు ముందే ఈ మూవీలోని ర‌ణ్ బీర్ క‌పూర్ లుక్ లీక్ కావ‌డంతో నెట్టింట వైర‌ల్ గా మారింది. ర‌ణ్ బీర్ ఈ పాత్ర కోసం మారిన తీరు ప్ర‌తీ ఒక్క‌రినీ షాక్ కు గురిచేసింది. ప్ర‌తిష్టాత్మ‌క యాష్ రాజ్ ఫిలింస్ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేప‌థ్యంలో వ‌స్తున్న మూవీ కావ‌డంతో ఈ చిత్రాన్ని చాలా ప్ర‌త్యేకత‌ల‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. వాణీ క‌పూర్ హీరోయిన్ గా న‌టించిన ఈ మూవీ ట్రైల‌ర్ ని తాజాగా శ‌నివారం చిత్ర బృందం విడుద‌ల చేసింది.

'ఏ క‌హానీ హై ఉప్ కీ.. జో కెహ‌తాతా గులామీ అచ్చీన‌హీ హోతీ..ఆజాతీ కొయి తుమే దేతాహీ న‌హీ..ఆజాదీ ఛీన్ నీ ప‌డ్తీహై..( స్వేచ్ఛ నీకు ఎవ్వ‌రో ఇవ్వ‌రు లాక్కోవాల్సిందే) అనే వాయిస్ తో ట్రైల‌ర్ మొద‌లైంది. ఇందులో ర‌ణ్ బీర్ క‌పూర్ బందిపోటు గ‌జ‌దొంగ షంషేరాగా క‌నిపించారు. య‌ష్ రాజ్ ఫిలంస్ మేకింగ్‌, అన్నే గోస్వామి ఫొటోగ్ర‌ఫీ..క‌నువిందు చేసే టెర్రిఫిక్ విజువ‌ల్స్‌, మిథూన్ నేప‌థ్య సంగీతం సినిమాని ఓ స్టాండ‌ర్డ్స్ లో నిల‌బెట్టి అంచ‌నాల్ని పెంచేశాయి. ఈ రేంజ్ సినిమా కోస‌మే బాలీవుడ్ ప్రేక్ష‌కులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు.

గ‌త నాలుగేళ్లుగా వాయిదా ప‌డుతూ వ‌స్తున్నా ఈ మూవీ జూలై 22న హిందీతో పాటు త‌మిళ‌, తెలుగు భాష‌ల్లోనూ ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్లలోకి రాబోతోంది. మ‌రి బాలీవుడ్ మేక‌ర్స్ అంచ‌నాల్ని ఈ మూవీ ఏ మేర‌కు అందుకుంటుందో .. బాలీవుడ్ కు ఎలాంటి హోప్ ని అందిస్తుందో తెలియాలంటే జూలై 22 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.