Begin typing your search above and press return to search.

షన్నుతో ఆహా ఏజెంట్ ప్లాన్!

By:  Tupaki Desk   |   4 July 2022 11:37 AM GMT
షన్నుతో ఆహా ఏజెంట్ ప్లాన్!
X
పలు షార్ట్ ఫిలిమ్స్ తో మంచి గుర్తింపుని ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ వరల్డ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను ఏర్పరచుకున్నాడు షణ్ముఖ జస్వంత్. యూట్యూబ్లో అతనికి ఏ స్థాయిలో క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

తెలుగు యూ ట్యూబర్స్ లో అయితే అత్యధికంగా ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి కూడా అతనే. ఏకంగా నాలుగు మిలియన్ల సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. అందులో ఎలాంటి వీడియో పోస్ట్ చేసినా కూడా ఈజీగా మిలియన్ల వ్యూవ్స్ అందుకుంటున్నాయి.

సాఫ్ట్‌వేర్ డెవలపర్’, ‘సూర్య వెబ్ సిరీస్ లు కూడా మంచి క్రేజ్ అందుకున్నాయి. యువతలో కూడా అతనికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని చెప్పాలి. వెబ్ సిరీస్ ల ద్వారా లక్షల్లో ఆదాయాన్ని అందుకుంటున్న షణ్ముఖ్ జస్వంత్ ఇప్పుడు మెల్లగా సినిమాల్లోకి రావడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఆ మధ్య బిగ్ బాస్ 5వ సీజన్లో రన్నరప్ గా నిలిచి రెమ్యునరేషన్ పరంగా మంచి ఆదాయాన్ని అందుకున్నాడు.

ఇక అతనికి అప్పటి నుంచే చాలా రకాల ఆఫర్లు వచ్చాయి కానీ తొందరపడకుండా మంచి కంటెంట్ తోనే గుర్తింపును అందుకోవాలని సిద్ధమయ్యాడు. ఇక ఆహా నుంచి అతనికి అదిరిపోయే ఆఫర్ వచ్చిందనే చెప్పాలి.

ఏజెంట్ ఆనంద్ సంతోష్’ (ఏఏఎస్) అనే టైటిల్ తో వెబ్ సీరీస్ ద్వారా మరోసారి విభిన్నంగా ఆడియెన్స్ ను ఆకట్టుకోవడానికి రెడీ అయ్యారు. సోలో బ్రతుకే సో బెటర్ దర్శకుడు సబ్బు డైరెక్ట్ చేస్తున్న ఈ వెబ్ సీరీస్ కు సంబంధించిన ఒక ఇంట్రో కూడా విడుదల చేశారు.

‘‘చంటబ్బాయికి వారసుడు.. ఆత్రేయకు తమ్ముడు.. పరిహాసంలో కానీ, పరిష్కారంలో కానీ తగ్గేదే లే’’ అంటూ ఏజెంట్ ఆనంద్ సంతోష్‌కు ఇంట్రో కూడా ఇచ్చారు. ఫస్ట్ లుక్‌లో షన్ను డిటెక్టివ్ అవతారంలో కనిపిస్తున్నాడు. చూస్తుంటే ఈ వెబ్ సీరీస్ కూడా సక్సెస్ అయ్యేలా ఉందని అనిపిస్తోంది. ఇంతకుముందు వెబ్ సీరీస్ లతో యూ ట్యూబ్ ద్వారా మంచి ప్రాఫిట్స్ అందుకున్న షన్ను ఇప్పుడు ఆహా నుంచి అంతకంటే ఎక్కువగా రెమ్యునరేషన్ ఈ ప్రాజెక్ట్ కోసం తీసుకున్నట్లు సమాచారం.