Begin typing your search above and press return to search.

బిగ్‌బాస్5 : షన్నూ సిరి గిల్లికజ్జాలు శృతి మించుతున్నాయా!

By:  Tupaki Desk   |   5 Nov 2021 5:11 AM GMT
బిగ్‌బాస్5 : షన్నూ సిరి గిల్లికజ్జాలు శృతి మించుతున్నాయా!
X
తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 లో యూట్యూబ్‌ స్టార్స్ అయిన షణ్ముఖ్‌ జష్వంత్‌ మరియు సిరిలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మొదట్లో వీరిద్దరి స్నేహం గురించి ఇంటి సభ్యులు స్వయంగా విమర్శలు చేశారు. ఎలిమినేట్ అయ్యి వెళ్లి పోతున్న వారు ఇద్దరు స్నేహంతో ఆడుతున్నారు.. కలిసి ఆడుతున్నారు అనే విమర్శలు చేసి వెళ్లి పోయారు. దాంతో కొన్ని రోజులు షన్నూ మరియు సిరిలు దూరం దూరంగా ఉన్నారు. కాని నాగార్జున ఎప్పుడైతే మీరు ఇద్దరు ఎందుకు దూరంగా ఉంటున్నారు.. ఎవరో ఏమో అన్నారని మీరు అలా చేయవద్దని చెప్పడంతో అప్పటి నుండి చాలా చాలా క్లోజ్‌ గా ఉంటున్నారు. ఒకే బెడ్‌ మొదలుకుని ఒక బ్లాంకెట్‌.. ఒకే కంచం అన్నట్లుగా ఇద్దరి స్నేహం కొనసాగుతోంది. ఇద్దరు ఎంత స్నేహంగా ఉంటున్నారో అంతే గొడవలు పడుతున్నారు.

వీరిద్దరిది స్నేహం మించి ఉందంటూ కొందరు అంటూ ఉంటే మరి కొందరు వీరిద్దరు నిజంగా స్నేహితులా లేదంటే కాబోయే భార్య భర్తలా అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల ఎలిమినేట్ అయిన లోబో బిగ్ బాస్ బజ్ లో మాట్లాడుతూ షన్నూ కు కాబోయే భార్య అయినా చేస్తుందో చేయదో సిరి అన్ని పనులు అతడికి చేస్తుంది. ఉదయం లేచినప్పటి నుండి బ్రష్‌ కు పేస్ట్‌ పెట్టివ్వడం మొదలుకుని అన్ని పనులు కూడా సిరి చేస్తుందని లోబో అన్నాడు. ఇద్దరి మద్య స్నేహంను మించి ఉందని అతడి మాటల ద్వారా అర్థం అవుతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. సరే స్నేహంగా ఉండటం మంచిదే. కాని ఇద్దరు కూడా పదే పదే గొడవ పడుతూ చిరాకు పెడుతూ ఉంటారు. కొన్ని సార్లు వీరి గొడవలు క్యూట్ గా అనిపించినా చాలా సార్లు మాత్రం చిరాకు తెప్పిస్తున్నాయి. కొన్ని సార్లు విసుగు కూడా తెప్పిస్తున్నాయి అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

తాజా ఎపిసోడ్‌ లో సిరి ని రెండు మూడు సార్లు షన్నూ తిట్టాడు. దాంతో ఆమె అలక పాన్పు ఎక్కింది. ఆమెను మొదట సీరియస్‌ గానే మాట్లాడించేందుకు ప్రయత్నించాడు. ఆ తర్వాత ఆమె గార్డెన్ ఏరియాలోకి వెళ్లి మరీ పడుకుని ఉండటంతో ఇక లాభం లేదని గుంజీలు తీసి మరీ ఆమెను లోనికి తీసుకు వెళ్లాడు. పది సార్లు ఆమెకు సారీ చెప్పాడు. అందరి ముందు కూడా సిరికి షన్నూ సారి చెప్పాడు. అలా పదే పదే షన్నూతో సారి చెప్పించుకుంటుంది మళ్లీ గొడవ మొదలవుతూనే ఉంది. సిరి మరియు షన్నూల మద్య ఈ గిల్లి కజ్జాలు మరీ ఎక్కువ అయ్యాయి అంటున్నారు. ఏదైనా ఒక మోస్తరు వరకు క్యూట్‌ గా నీట్ గా బాగుంటుంది. కాని ఇద్దరి వ్యవహారం శృతి మించితే బోర్‌ కొడుతుంది... చిరాకు లేస్తుందంటున్నారు.