Begin typing your search above and press return to search.

అన్ని హీరోలా ఫ్యాన్సుకూ శంకరాభరణమే!!

By:  Tupaki Desk   |   23 Nov 2015 11:30 AM GMT
అన్ని హీరోలా ఫ్యాన్సుకూ శంకరాభరణమే!!
X
ఇప్పుడున్న పరిస్థితుల్లో.. సినిమాను తీయడం కంటే సినిమాను ప్రమోట్‌ చేయడమే చాలా ముఖ్యం. అందుకే అందరూ ఏదో ఒక కొత్త పోకడలో తమ సినిమాలను ప్రమోట్‌ చేసేస్తున్నారు. అదిగో ఇప్పుడు శంకరాభరణం మూవీ టీమ్‌ కూడా సేమ్‌ టు సేమ్‌ ఇదే రూటులో వెళ్ళిపోతోంది.

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ను ఈ సినిమా టీజర్‌ లాంచ్‌ చేయడానికి పిలిచిన సంగతి తెలిసిందే. ఆయన సర్దార్ సెట్‌ లోనే టీజర్‌ ను లాంచ్‌ చేశారు. కట్ చేస్తే.. అంతకంటే పెద్ద పబ్లిసిటీ ఏంటంటే.. పవన్‌ బర్త్ డే నాడు ఈ సినిమా స్పెషల్‌ పోస్టర్లు కూడా వేసేశారు. ఇక బాక్సాఫీస్‌ బాహుబలి అంటూ ప్రభాస్‌ పుట్టినరోజు నాడు కూడా కొన్ని పోస్టర్లు పడ్డాయ్‌. ఇప్పుడేమో నాగ చైతన్య కు కూడా బర్త్ డే విషెస్‌ వేశారు. అయ్యా.. ఏంటిలా కొత్తగా? అంటే.. అసలు మన రైటర్‌ డైరక్టర్‌ ఏ హీరోను కూడా వదిలేలా లేరు. అందరికీ విషెస్‌ చెబుతూనే మనోడు 'శంకరాభరణం' సినిమాను భారీగా ప్రమోట్‌ చేస్తున్నట్లు ఇట్టే అర్ధమవుతోంది. ఆ విధంగా రిలీజ్‌ రోజున స్టార్‌ హీరోలందరి అభిమానులూ నిఖిల్‌ కు భారీ ఓపెనింగ్‌ ఇవ్వాలని కాబోలు.

మొత్తానికి కోన స్ర్టాటజీ ఏమో కాని.. ఇలా అందరికీ విషెస్‌ చెప్పుకుంటే పోతే.. ఆడియన్సుకు లేనిపోని సందేహాలు కూడా వచ్చేస్తున్నాయ్‌. నిఖిల్‌ కు ఉన్న ఇమేజ్‌ కు సినిమా బాగానే ప్రమోట్‌ అవుతుంది. మరి కొత్తగా ఈ పక్క హీరోల ఆశీర్వచనాలు ఎందుకో?? ఏంటో.. ఏం చేసినా కోన సార్‌ స్పెషల్‌ గా చేయాలని అనుకుంటూ ఉంటారు.