Begin typing your search above and press return to search.
శంకర్ వర్సెస్ రవిచంద్రన్.. ముదురుతు వార్!
By: Tupaki Desk | 17 Sept 2021 4:00 PM ISTచియాన్ విక్రమ్ కథానాయకుడిగా స్టార్ ఫిలిం మేకర్ శంకర్ దర్శకత్వంలో ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించిన `అపరిచితుడు` అప్పట్లో సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. తమిళ్..తెలుగు భాషల్లో ఈ చిత్రం ఈ కాంబినేషన్ కి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఈచిత్రాన్ని హిందీలో రణ్ వీర్ సింగ్ హీరోగా మాతృకకు దర్శకత్వం వహించిన శంకర్ రీమేక్ చేస్తున్నట్లు ఈఏడాది ఏప్రిల్ ల్లో ప్రకటించారు. జయంతీలాల్ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించడానికి ముందుకొచ్చారు. దీంతో మాతృక నిర్మాత రవిచంద్రన్ ఒక్కసారిగా సీన్ లోకి వచ్చి తను అనుమతి లేకుండా `అపరిచితుడు` ని ఎలా రీమేక్ చేస్తారని ప్రశ్నించారు.
ఆ సినిమా హక్కులు నిర్మాతగా తనకు మాత్రమే దక్కుతాయని..మరోకరు రీమేక్ చేయడానికి ఛాన్స్ లేదని శంకర్ ని హెచ్చరించారు. దీంతో ఇరువురి మధ్య కొంత డిస్కషన్ జరిగింది. వివాదాలు తలెత్తినట్లు కోలీవుడ్ మీడియా హీటెక్కించింది. తాజాగా రవిచంద్రన్ మరోసారి అప్ డేట్ ఇస్తూ...తానే ఈ చిత్రాన్ని హిందీ..ఇంగ్లీష్ భాషల్లో బాలీవుడ్..హాలీవుడ్ నటులతో రీమేక్ చేస్తానని ప్రకటించారు. ఈ విషయంలో సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ సహకారం తనకుందని..తనని ఎవరూ ఆపలేరని ప్రకటనను ఇచ్చారు. రీమేక్ నేపథ్యలో కొందరు నేను డబ్బులు తీసుకుంటున్నానని కట్టు కథలు చెబుతున్నారు.
అవన్నీ అవాస్తవాలు. ఎవరి దగ్గర నుంచి రూపాయి కూడా తీసుకోలేదు. నేనే స్వయంగా చిత్రాన్ని నిర్మిస్తానని రవిచంద్రన్ వెల్లడించారు. శంకర్- జయంతి లాల్ పై చట్టపరంగా చర్యలు తీసుకుంటానన్నారు. ఈ విషయంలో ఎన్ని కోర్టులైనా...ఎంత కాలమైనా తిరుగుతానని వెల్లడించారు. తన సినిమా ని తానే నిర్మించుకుంటానని..ఇతరులు అందుకు సాహసం చేయాల్సిన పనిలేదని సెటైరికల్ గా స్పందించారు. మరి దీనిపై శంకర్-జయంతిలాల్ ద్వయం ఎలా స్పందిస్తుందో చూడాలి. మాతృకలో `అపరిచితుడు` టైటిల్ `అన్నీయన్ `అన్న సంగతి తెలిసిందే.