Begin typing your search above and press return to search.

శంకర్‌ కొత్త రచయితని వెతుక్కున్నాడు

By:  Tupaki Desk   |   27 Jun 2015 1:00 AM IST
శంకర్‌ కొత్త రచయితని వెతుక్కున్నాడు
X
స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ ఏ సినిమా తీసినా సంచలనమే. మైండ్‌ బోయింగ్‌ అనిపించే కథని ఎంచుకుని విజువల్‌ గ్రాండియారిటీతో తెరకెక్కించడం అతడి ప్రత్యేకత. భారతీయుడు, జీన్స్‌, బోయ్స్‌, అపరిచితుడు, రోబో, ఐ... ఇలా ప్రతి సినిమా దేనికదే ప్రత్యేకం. అయితే ఈ సినిమాలన్నిటి వెనుకా ఓ ఆజ్ఞాత శక్తి పనిచేసింది. ఆ శక్తి ఇప్పుడు శంకర్‌తో లేదు. దాని ఫలితం 'ఐ' సినిమాతో తెలిసిపోయింది.

ప్రముఖ తమిళ రచయిత, టెక్నాలజీ గురూ సుజాత రంగరాజన్‌ లేని లోటు ఇన్నాళ్టికి తెలిసొచ్చింది. అసలు శంకర్‌ శిరస్సు అయితే అతడు రెండు కళ్లు లాంటివాడు. భారతీయుడు కత్తి పోటును కనిపెట్టింది.. జీన్స్‌లో కవలసోదరుల పుట్టుకను కనిపెట్టింది, అసలు మనిషిలో మల్టిపుల్‌ బిహేవియర్‌ని కనిపెట్టి లోన దాగి ఉండే అపరిచితుడిని వెలికి తీసింది... రోబోకి ప్రాణం పోయాలనుకున్నది ఇతగాడే. వీటన్నిటికీ కథలు అందించింది సుజాత రంగరాజన్‌ అనే మహారచయిత. తమిళనాట సైన్స్‌ అండ్‌ టెక్నాలజీపై సందేహాలు తీర్చేవాడిగా, నవలా రచయితగా, కాలమిస్టుగా, పత్రికాధినేతగా సుజాత సుపరిచితం. ఆ మధ్య రోబో కథ రాసిన తర్వాత అతడు మరణించారు. నాటి నుంచి శంకర్‌కి కష్టాలు మొదలయ్యాయి. ఐ లాంటి సినిమాలో అన్ని లూప్‌హోల్స్‌ వచ్చాయంటే కారణం సుజాత అండ దండలు లేకపోవడమే.

అందుకే ఆ లోపాన్ని సరిచేసుకునే పనిలో ఉన్నాడు శంకర్‌. ప్రస్తుతం వేరొక విజ్ఞాన భాండాగారాన్ని తన వెంట తీసుకెళ్తున్నాడు. తనతో పాటు ప్రముఖ రచయిత జయమోహన్‌ ఉంటున్నాడిప్పుడు. జయమోహన్‌ ట్రాక్‌ రికార్డ్‌ చాలా పెద్దది. మణిరత్నం, బాల వంటి దిగ్గజాలతో కలిసి పనిచేశారాయన. ఇప్పుడు శంకర్‌ కొలువులో రోబో- 2 కథ కోసం కుస్తీలు పడుతున్నాడు. సుజాత రచించిన రోబో సినిమాతో పోలిస్తే నాలుగింతలు గొప్ప కథ తయారైనప్పుడే అది జనాల్ని సంతృప్తి ఇవ్వగలదు. లేదంటే ప్రమాదంలో పడినట్టే.

అందుకే రోబో -2 కథ కోసం జయమోహన్‌తో కలిసి శంకర్‌ తీవ్రంగా కసరత్తు చేస్తున్నాడు. ఈ చిత్రంలో రజనీకాంత్‌ హీరోగా, షారూక్‌ఖాన్‌ విలన్‌గా నటిస్తారని ఓ ప్రచారం ఊపందుకుంది. ఇతర వివరాల కోసం వెయిట్‌ అండ్‌ సీ.