Begin typing your search above and press return to search.

#RC15 : థమన్ వర్క్ పట్ల శంకర్‌ రియాక్షన్‌

By:  Tupaki Desk   |   10 Sep 2021 8:09 AM GMT
#RC15 : థమన్ వర్క్ పట్ల శంకర్‌ రియాక్షన్‌
X
ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన రామ్‌ చరణ్.. శంకర్‌ ల కాంబో మూవీ పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. మరో వైపు సినిమా కోసం భారీ సెట్టింగ్స్ నిర్మాణం కూడా జరుగుతున్నాయి. ఏ సమయంలో అయినా సినిమా రెగ్యులర్ షూటింగ్‌ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ సినిమాకు సంగీతాన్ని థమన్‌ అందిస్తున్నాడు. ఇప్పటి వరకు శంకర్‌ సినిమా అంటే రహమాన్ సంగీతం అన్నట్లుగా బ్రాండ్ క్రియేట్‌ అయ్యింది. ఇలాంటి సమయంలో థమన్‌ ను శంకర్ తీసుకోవడం పట్ల కొందరు పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా రామ్‌ చరణ్‌ అభిమానులు ఈ విషయంలో శంకర్‌ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. అయితే పరిస్థితుల కారణంగానే థమన్‌ ను శంకర్ ఎంపిక చేసుకోలేదని.. ఈ సబ్జెక్ట్‌ కు ఆయన న్యాయం చేస్తాడు అనే నమ్మకం తో ఎంపిక చేసుకున్నట్లుగా తమిళ మీడియా వర్గాల వారు చెబుతున్నారు.

తాజాగా సినిమా షూటింగ్‌ ప్రారంభం అయ్యింది. ఈ సందర్బంగా థమన్‌ తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు గాను శంకర్ కు కృతజ్ఞతలు చెప్పాడు. తనకు వచ్చిన ఈ ఆఫర్‌ ను సద్వినియోగం చేసుకునేందుకు ది బెస్ట్ ఔట్‌ పుట్‌ ఇస్తాను అంటూ నమ్మకం వ్యక్తం చేశాడు. థమన్‌ ట్వీట్ కు శంకర్ స్పందించాడు. నీవు రికార్డు చేసిన ఫస్ట్‌ సాంగ్ పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నాను. ఫస్ట్‌ సాంగ్ నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. మొదటి సాంగ్ ను అదిరే లెవల్‌ లో ఇచ్చావు. అదే విధంగా మిగిలిన పాటలను కూడా నువ్వు అదే స్థాయిలో ఇస్తావనే నమ్మకంతో ఉన్నాను. సినిమా ఆల్బం మరో లెవల్‌ లో ఉండేలా థమన్ ప్లాన్‌ చేస్తున్నాడు. అన్ని భాషల ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఈ సినిమా పాటలు ఉంటాయని అంటున్నారు. సినిమా చిత్రీకరణ మొదలు పెట్టక ముందే పాటలను రికార్డు చేస్తున్న కారణంగా మొదట పాటలను షూట్‌ చేస్తారనే టాక్ కూడా వినిపిస్తుంది.

రామ్ చరణ్‌ ఆర్ ఆర్ ఆర్‌ వంటి బిగ్గెస్ట్‌ మూవీ తర్వాత చేస్తున్న సినిమా అవ్వడంతో పాటు శంకర్ వంటి అంతర్జాతీయ స్థాయి ఉన్న దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించడం.. దిల్‌ రాజు బ్యానర్‌ లో ఇది 50వ సినిమా అవ్వడం వల్ల కూడా అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉన్నాయి. మెగా ఫ్యాన్స్ మరియు తెలుగు ప్రేక్షకులతో పాటు మొత్తం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు వీరి కాంబో కోసం ఎదురు చూస్తున్నారు. రామ్‌ చరణ్ మరియు శంకర్‌ ల కాంబో మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీకాంత్‌.. సునీల్‌ ఇంకా ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. వచ్చే ఏడాది చివరి వరకు ఈ సినిమాను ముగించేలా ప్లాన్‌ చేస్తున్నట్లుగా మేకర్స్‌ చెబుతున్నారు. అతి త్వరలోనే సినిమా షూటింగ్‌ ను మొదలు పెట్టాలని దిల్ రాజు కాంపౌండ్‌ లో భావిస్తున్నారు. శంకర్ కూడా రెడీగా ఉన్నారు. చరణ్‌ విషయంలోనే కాస్త వెయిటింగ్‌ అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ విషయంలో కూడా స్పష్టత వస్తుందేమో చూడాలి.