Begin typing your search above and press return to search.

నాగశౌర్య సినిమాలో త్రివిక్రమ్ టచ్

By:  Tupaki Desk   |   31 March 2017 5:05 AM GMT
నాగశౌర్య సినిమాలో త్రివిక్రమ్ టచ్
X
గతేడాది జ్యో అచ్యుతానంద మూవీతో హీరో నాగశౌర్య మంచి హిట్ సాధించాడు. యాక్టర్ గా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. అప్పటి నుంచి ఇన్ని నెలల పాటు ఈ హీరో కొత్త సినిమా ఒప్పుకోకపోవడం కానీ.. కానీ ప్రాజెక్ట్ ఫైనల్ చేయకపోవడం కానీ ఆశ్చర్యమే. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ఈ హీరో కొత్త సినిమా మొదలవుతోంది. ఏప్రిల్ 10 నుంచి షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు చెప్పారు నిర్మాత శంకర్ ప్రసాద్.

ప్రొడ్యూసర్ శంకర్ ప్రసాద్ ఎవరో కాదు.. స్వయంగా నాగశౌర్య తండ్రే. 'మేం నాగశౌర్య కెరీర్ ను నెక్ట్స్ లెవెల్ కి తీసుకెళ్లాలని భావించాం. అందుకే స్టోరీ.. స్క్రిప్ట్ పై ఎక్కువ కాలం పని చేశాం. చివరకు అన్నీ పర్ఫెక్ట్ గా కుదిరాయి. ఈ సినిమా డైలాగ్స్ లో త్రివిక్రమ్ టచ్ కనిపిస్తుంది. ఎందుకంటే.. ఈ చిత్ర దర్శకుడు వెంకట్ కుడుముల.. గతంలో చాలాకాలం పాటు త్రివిక్రమ్ తో కలిసి వర్క్ చేశాడు. అతను నేరేట్ చేసిన స్టోరీ బాగా నచ్చింది. అలాగే మా అబ్బాయితో సినిమా నిర్మించాలన్న ఆలోచన ఇప్పటికి కార్యరూపం దాల్చింది' అంటున్నారు ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన శంకర్ ప్రసాద్.

కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో.. రొమాంటిక్ ఎంటర్టెయినర్ గా నాగశౌర్య కొత్త సినిమా రూపొందనుంది. రష్మి మందన హీరోయిన్ గా నటించబోతోంది. ఏప్రిల్ 10న షూటింగ్ ప్రారంభించి వరుస షెడ్యూల్స్ తో మూవీ షూటింగ్ పూర్తి చేయనున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/