Begin typing your search above and press return to search.
ఇండియన్ 2 కు ముందు మల్టీస్టారర్ ను చేస్తున్న శంకర్
By: Tupaki Desk | 1 Nov 2020 8:00 PM ISTసౌత్ ఇండియా దిగ్గజ దర్శకుడు శంకర్ ఏ సినిమా చేసినా భారీగా ఉంటుంది. రోబో సినిమాను ఏ స్థాయిలో చేశాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక 2.ఓ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో రూపొందించాడు. ప్రస్తుతం శంకర్ ఇండియన్ 2 సినిమాను చేస్తున్నాడు. రెండేళ్ల క్రితం ప్రారంభం అయిన ఇండియన్ 2 అనేక కారణాల వల్ల వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది. కరోనా కారణంగా ఎనిమిది నెలలుగా నిలిచి పోయిన సినిమాను పునః ప్రారంభించాలని భావించగా కమల్ ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలకు సిద్దం అవుతున్నాడు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ పోటీ చేసేందుకు సిద్దం అవుతున్న కారణంగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్ 2 మూవీని పక్కకు పెట్టాడు. షూటింగ్ ను ఎన్నికల తర్వాత పూర్తి చేయాలని భావిస్తున్నారట. కమల్ ఎన్నికలకు సిద్దం అవుతున్న ఈ సమయంలో శంకర్ ఒక భారీ మల్టీస్టారర్ ను చేసేందుకు రెడీ అవుతున్నాడట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం కన్నడ స్టార్ యశ్.. తమిళ స్టార్ విజయ్ సేతుపతి మరియు తెలుగు మరియు మలయాళం నుండి ఇద్దరు హీరోలను తీసుకుని ఒక భారీ మల్టీ స్టారర్ ను ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటికే యశ్ మరియు విజయ్ సేతుపతిలు శంకర్ కు ఓకే చెప్పారు. త్వరలో మరో ఇద్దరు కూడా ఓకే చెప్తే సినిమా మొదలు పెట్టే అవకాశం ఉంది. వచ్చే ఏడాది సమ్మర్ లో మొదలు పెట్టి వచ్చే ఏడాది చివరి వరకు పూర్తి చేసి 2022 లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాడు అంటూ తమిళ సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో అభిప్రాయం వ్యక్తం అవుతోంది.