Begin typing your search above and press return to search.
2.0 టీజర్ పై ఒక అప్డేట్
By: Tupaki Desk | 26 Jan 2018 10:34 PM ISTఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన 2.0 సినిమా కోసం ప్రస్తుతం సినీ లోకం ఎంతగానో ఎదురుచూస్తోంది. అయితే సినిమా గురించి అప్డేట్స్ అయితే చాలా వస్తున్నాయి గాని సినిమాకు సంబందించిన టీజర్స్ గాని ట్రైలర్స్ గాని రావడం లేదు. విడుదల గురించి గత కొంత కాలంగా సినిమాకు సంబందించిన వారే ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పారు. అయితే లేటెస్ట్ గా దర్శకుడు శంకర్ సరికొత్త అప్డేట్ తో అభిమానులకు కొంచెం ఊరటను కలిగించాడు.
ప్రస్తుతం టీజర్ కు సంబందించిన గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నాయట. లాస్ ఏంజిల్స్ లోని ప్రముఖ మాబ్ సీన్ సంస్థలో పనులు వేగంగా జరుగుతున్నాయని ఆ గ్రాఫిక్స్ వర్క్స్ ఫినిష్ అయితే టీజర్ ను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని శంకర్ ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు. బహుశా వచ్చే నెల ఎండింగ్ లో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా అనుకున్నట్టుగానే హైదరాబాద్ లో సినీ ప్రముఖుల మధ్యన టీజర్ ని విడుదల చేస్తారని సమాచారం.
దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా 3డి లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రజినీకాంత్ - అక్షయ్ కుమార్ అలాగే అమీ జాక్సన్ ముఖ్య పాత్రల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక సినిమాను ఏప్రిల్ 14న రిలీజ్ కానుందని గత నెల రజినీకాంత్ అభిమానులతో సమావేశం అయినప్పుడు చెప్పాడు. కానీ ఆ డేట్ పై కూడా పలు అనుమానాలు వస్తున్నాయి. మరి ఆ గ్రాఫిక్స్ పనులు ఎప్పుడు అయిపోతాయో.. సినిమా ఎప్పుడు వస్తుందో?