Begin typing your search above and press return to search.
చరణ్ కంటే శంకర్ కు 10 ఎక్కువే!
By: Tupaki Desk | 10 July 2021 2:00 PM ISTసౌత్ లో దిగ్గజ దర్శకుడిగా పేరున్న శంకర్ సినిమా అంటే కేవలం తమిళం.. తెలుగు భాషల ప్రేక్షకుల్లోనే కాకుండా పాన్ ఇండియా ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. పాన్ ఇండియా మూవీస్ కు పెట్టింది పేరు అయిన శంకర్ తన ప్రతి సినిమాను భారీ బడ్జెట్ తో చేస్తూ ఉంటాడు. ఇండియన్ 2 సినిమా కొన్ని కారణాలతో నిలిచి పోవడంతో ప్రస్తుతం రామ్ చరణ్ తో తెలుగు మరియు తమిళంలో ద్విభాష చిత్రంను తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ కాంబో అధికారిక ప్రకటన వచ్చి చాలా రోజులు అయ్యింది. ఇండియన్ 2 వివాదం కారణంగా కాస్త వెనుక ముందు అయినా కూడా ఎట్టకేలకు శంకర్ కు కోర్టులో అనుకూల తీర్పు వచ్చింది కనుక ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను ముగించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
శంకర్ దర్శకత్వంలో సినిమా అంటే బడ్జెట్ తో పాటు పారితోషికాలు కూడా భారీగానే ఉంటాయి. ముఖ్యంగా శంకర్ భారీ పారితోషికంను డిమాండ్ చేస్తాడని.. తాను కోరుకున్నట్లుగా నిర్మాతలు ఖర్చు చేయాల్సి ఉంటుంది అంటూ ఉంటారు. వీటన్నింటికి దిల్ రాజు ఓకే చెప్పి రంగంలోకి దిగి ఉంటాడు. శంకర్ పారితోషికం విషయంలో అస్సలు రాజీ పడడు అనే టాక్ ఉంది. అందుకే విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం రామ్ చరణ్ కంటే శంకర్ ఎక్కువ పారితోషికంను అందుకుంటున్నాడు. దాదాపుగా పది కోట్ల రూపాయలను చరణ్ కంటే శంకర్ అదనంగా దిల్ రాజు నుండి అందుకుంటున్నాడని అంటున్నారు.
చరణ్ కు సినిమా విడుదల తర్వాత లాభాల్లో వాటా ఉంటుందని అంటున్నారు. సినిమా మినిమంగా సక్సెస్ అయినా కూడా చరణ్ కు భారీ మొత్తంలోనే లాభాల్లో వాటా దక్కుతుంది అంటున్నారు. తద్వార శంకర్ పారితోషికంతో మ్యాచ్ చేస్తాడని అంటున్నారు. ఇక శంకర్ ఈ సినిమా వర్క్ ను వచ్చే ఏడాది చివరి వరకు పూర్తి చేసేలా ఒప్పందం చేసుకున్నారట. ఏడాది కాలంలో సినిమాను పూర్తి చేసి విడుదల కు సిద్దం చేయాలని.. లేదంటే పారితోషికం లో కోత లేదంటే లీగల్ యాక్షన్ ఉంటుందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. 2023 లో సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తో చరణ్ మరో సారి పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వెళ్లే అవకాశం దక్కించుకున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి.