Begin typing your search above and press return to search.

శంక‌ర్ - రామ్ చ‌ర‌ణ్ లోకేష‌న్‌ల వేట‌

By:  Tupaki Desk   |   3 Feb 2022 10:31 AM GMT
శంక‌ర్ - రామ్ చ‌ర‌ణ్ లోకేష‌న్‌ల వేట‌
X
జ‌క్క‌న్న అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌`. ఈ చిత్రంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో క‌లిసి న‌టించిన రామ్ చ‌ర‌ణ్ ఈ మూవీ రిలీజ్ కి డేట్ ఫైన‌ల్ కావ‌డంతో త‌న త‌దుప‌రి సినిమాపై ఫోక‌స్ పెట్టారు. `ఆర్ ఆర్ ఆర్‌` త‌రువాత భారీ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన ద‌ర్శ‌కుడు శంక‌ర్ తో క‌లిసి మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌రణ్ ఓ భారీ చిత్రాన్ని చేస్తున్న విష‌యం తెలిసిందే. త్వ‌ర‌లో ఈ చిత్రానికి సంబంధించిన తాజాగా షెడ్యూల్‌ ప్రారంభం కాబోతోంది.

దిల్ రాజు,శిరీష్‌ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీ స్టూడియోస్ కూడా భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తోంది. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈమూవీ కీల‌క‌ఘ‌ట్టాల చిత్రీక‌ర‌ణ కోసం శంక‌ర్ అండ్ టీమ్ లొకేష‌న్ ల వేట‌లో ప‌డ్డారు. పొలిటిక‌ల్ నేప‌థ్యంలో సెటైరిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ మూవీని శంక‌ర్ తెర‌కెక్కిస్తున్నారు. గ‌త కొన్ని రోజులుగా ఈ మూవీ తాజా షెడ్యూల్ షూటింగ్ కోసం ద‌ర్శ‌కుడు శంక‌ర్ వివిధ ప్రాంతాల్లో టీమ్ తో ప‌ర్య‌టిస్తున్నారు.

తూర్పుగోదావ‌రి పరిస‌ర ప్రాంతాల్లో ఇటీవ‌లే త‌న టీమ్ తో ప‌ర్య‌టించిన శంక‌ర్ తాజ‌.ఆగా మ‌రికొన్ని ప్ర‌దేశాల‌ని ప‌రిశీలిస్తున్నారు. తాజాగా త‌న టీమ్ లోని కీల‌క మెంబ‌ర్ లు, ఆర్ట్ డైరెక్ట‌ర్ తో క‌లిసి శంక‌ర్ అమృత్ స‌ర్ వెళ్ల‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అక్క‌డ కథ డిమాండ్ మేర‌కు ఏ లొకేఫ‌ష‌న్ లు అవ‌స‌ర‌మే చూసి ఫైన‌ల్ చేసుకుని తిరిగి హైద‌రాబాద్ చేరుకుంటారు.

అంతే కాకుండా శంక‌ర్ ఈ మూవీని స‌మ‌కాలీన రాజ‌కీయ అంశాల నేప‌థ్యంలో సెటైరిక‌ల్ మూవీగా తెర‌కెక్కించ‌బోతున్నారు. ఇందు కోసం ఓ మిడిల్ క్లాస్ ఇల్లు.. కీల‌కంగా నిలిచే ఎన్నిక‌లకు సంబందించిన స‌న్నివేశాల అవ‌సరం వుందని చెబుతున్నారు. దీని కోస‌మే శంక‌ర్ ప్ర‌స్తుతం అన్వేషిస్తున్నార‌ట‌. అంతే కాకుండా అమ‌రావతికి సంబంధించిన స‌న్నివేశాలు కూడా సినిమాలో కీల‌కంగా నిల‌వ‌నున్నాయ‌ని తెలుస్తోంది. ఇందు కోసం ఏకంగా అమ‌రావతిలోనే షూటింగ్ చేస్తారా? లేక హైద‌రాబాద్ పరిస‌రాల్లో అమ‌రావ‌తి సెట్ ని రీ క్రియేట్ చేస్తారా? అన్న‌ది తెలియాల్సి వుంది.

ఇదిలా వుంటే శంక‌ర్ త‌న టీమ్ తో అమృత్ స‌ర్ కు ఎందుకు వెళ్లార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఇటీవ‌ల జ‌రిగిన రైతు ఉద్య‌మాన్ని కూడా ఇందులో చూపించాల‌న్న ప్ర‌య‌త్నం కోస‌మే అమృత్ స‌ర్ వెళ్లారా? .. లేక మ‌రో కార‌ణం వుందా? అన్న‌ది తెలియాల్సి వుంది. ఇప్ప‌టికే మిడిల్ క్లాస్ ఇల్లు, ప్ర‌భుత్వ కార్యాల‌యం వంటి వాటిని సెట్ లో నిర్మించాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. శంక‌ర్ టీమ్ అమృత్ స‌ర్ నుంచి తిరిగి వ‌చ్చాక మిగ‌తా కీల‌క అంశాల‌పై ఓ క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం వుంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి.