Begin typing your search above and press return to search.

500 కోట్ల పైనే అంటున్న శంకర్

By:  Tupaki Desk   |   30 Sept 2018 11:09 AM IST
500 కోట్ల పైనే అంటున్న శంకర్
X
శంకర్ దర్శకత్వంలో సూపర్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం '2.0'. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ సినిమాలో మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా బడ్జెట్ ఎంత అనే విషయంలో మొదటి నుండి భారీ చర్చలే సాగుతున్నాయి. ఒకసారి 200 కోట్లు అంటే మరో సారి 250 కోట్లని అన్నారు. తర్వాత మరో వంద పెంచి 350 కోట్లన్నారు.

డిలే కావడం.. వీఎఫ్ ఎక్స్ వర్క్స్ ను మరింత క్వాలిటీతో చేపట్టడం తో ఈ సినిమాకు 450 కోట్లు అన్నారు. రీసెంట్ గా టీజర్ రిలీజ్ సమయంలో బీబీసి లో ఒక కథనం ప్రసారమైంది. అందులో ఈ సినిమా బడ్జెట్ 75 మిలియన్ డాలర్స్ అని చెప్పారు. అంటే 543 కోట్ల రూపాయలన్నమాట. ఇదే విషయాన్ని '2.0' పోస్టర్ లో కూడా వేయడం జరిగింది. ఈమధ్య బడ్జెట్ విషయంపై మాట్లాడుతూ.. "నాకు తెలిసినంతవరకూ సినిమా ప్రొడక్షన్ కాస్ట్ - పబ్లిసిటీ -ఇతర ఖర్చులను లెక్క వేసుకుంటే 70 నుండి 75 మిలియన్స్ బడ్జెట్ అయింది" అన్నాడు.

లైకా ప్రొడక్షన్స్ లాంటి ప్రొడ్యూసర్ తనకు లభించడం అదృష్టమని చెప్పాడు. 'రోబో' సమయంలో తను ఆశించిన బడ్జెట్ దక్కలేదని అప్పట్లో ఇలా ఖర్చుపెట్టే పరిస్థితులు లేవని అన్నాడు. కానీ లైకా వారు పూర్తి సహకారం అందించడం వల్ల '2.0' విషయంలో అసలేమాత్రం రాజీ పడలేదని అన్నాడు. మరోవైపు వీఎఫ్ ఎక్స్ కంపెనీలు గతంలో ఏం చెప్తే అది తాము వినాల్సి వచ్చేదని ఇప్పుడు మాత్రం రాజీ పడకుండా అన్నీ పర్ఫెక్ట్ గా కుదిరేలా స్వయంగా చూసుకున్నానని తెలిపాడు. సినిమా బడ్జెట్ 540 కోట్లంటే.. ఎంతకు అమ్మాలి? అది బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం 600 కోట్లు తీసుకురావాలి. ఈ లెక్కన శంకర్ ముందున్న టార్గెట్ పే...ద్దదే.