Begin typing your search above and press return to search.

శంక‌ర్ కి అలాంటి కన్ప్యూజ‌న్ లేదుగా?

By:  Tupaki Desk   |   6 Sep 2022 9:33 AM GMT
శంక‌ర్ కి అలాంటి కన్ప్యూజ‌న్ లేదుగా?
X
దేశం గ‌ర్వించద‌గ్గ ద‌ర్శ‌కుడు శంక‌ర్ సినిమాలో న‌టించ‌డం అన్న‌ది ప్రతీ హీరోకి ఓ డ్రీమ్ లాంటింది. అత‌నితో అవ‌కాశం రావ‌డ‌మే గ‌గ‌నం అనుకుంటారంతా. వ‌స్తే ఆ ఛాన్స్ ఏ హీరో మిస్ చేసుకోడు. శంక‌ర్ భారీ త‌నాన్ని భ‌రించ‌లేక నిర్మాత‌లు త‌ప్పుకుంట‌రు త‌ప్ప‌! హీరోలు మాత్రం హిట్ అయినా..ప్లాప్ అయినా అత‌నితో ఒక్క సినిమా అయిన చేయాలి అనుకున్న‌వాళ్లే ఉంటారు.

అదీ ఇండియాలో శంక‌ర్ రేంజ్. ఇప్పుడా అరుదైన అవ‌కాశాన్ని మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అందుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం తన‌తోనే త‌న 15వ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లారు. ఇప్ప‌టికే స‌గానికి పైగా షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పెండింగ్ షూట్ చేసే ప‌నిలోనూ టీమ్ నిమ‌గ్న‌మైంది. అయితే ఇదే స‌మ‌యంలో శంక‌ర్ అటు ఇండియాన్-2 బ్యాలెన్స్ షూటింగ్ సైతం ఉన్న ప‌ళంగా పూర్తి చేయాల్సిన ఆవ‌శ్య‌క‌త ఏర్ప‌డిన సంగ‌తి తెలిసిందే.

దీంతో శంక‌ర్ ఈ సినిమాని కూడా ఇటీవ‌లే మ‌ళ్లీ సెట్స్ కి తీసుకెళ్లారు. ప్ర‌స్తుతం శంక‌ర్ రెండు ప‌డ‌వ‌ల ప్రయాణం చేస్తున్నారు. హైద‌రాబాద్ టూ చెన్నై తిరిగ‌తితే ఒకేసారి రెండు సినిమాల షూటింగ్ ల‌కు హాజ‌ర‌వుతున్నారు. అయితే ఇలా చేయ‌డం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వ కెరీర్ లోనే తొలిసారి అని చెప్పొచ్చు. శంక‌ర్ కి ఇంత వ‌ర‌కూ అలాంటి అవ‌స‌రం రాలేదు.

ఆయ‌న ఏ ప్రాజెక్ట్ మొద‌లు పెట్టినా పూర్తిచేయ‌డానికి సంవ‌త్స‌రాలు ప‌డుతుంది. మేకింగ్ ప‌రంగా ఎక్కువ స‌మ‌యం కేటాయిస్తారు. ది బెస్ట్ అవుట్ ఫుట్ ఇవ్వ‌డం కోస‌మే శంక‌ర్ ఇంత స‌మ‌యాన్ని వెచ్చిస్తారు. బ‌డ్జెట్ విష‌యంలోనూ శంక‌ర్ ఎక్క‌డా రాజీ ప‌డ‌రు. త‌ను కావాల్సిందల్లా నిర్మాత త‌క్ష‌ణం ఏర్పాటు చేయాల్సిందే. శంక‌ర్ తో సినిమా చేయాలంటే? ఇవ‌న్నీ క‌చ్చితంగా ప్రొడ‌క్ష‌న్ హౌసెస్ ఇవ‌న్నీ పాటించి తీరాల్సిందే.

అయితే అస‌లు సందేహం ఒక్క‌టే అభిమానుల బుర్ర‌ల్ని తొలిచేస్తుంది. ఒకేసారి రెండు సినిమాలు శంక‌ర్ డీల్ చేయ‌గ‌ల‌రా? ఎలాంటి క‌న్ ప్యూజ‌న్ లేకుండా రెండింటిని పూర్తి చేయ‌గ‌ల‌రా? అంటూ సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఇంత వ‌ర‌కూ ఇలాంటి అనుభ‌వం లేదు. సాధార‌ణంగా ఏ ద‌ర్శ‌కుడు కూడా ఒక సినిమా పూర్త‌య్యే వ‌ర‌కూ వేరే సినిమా మొద‌లు పెట్ట‌రు.

కానీ ఇక్క‌డ శంక‌ర్ ప‌రిస్థితి భిన్నం. 'ఇండియాన్ 2' వివాదం నేప‌థ్యంలో కోర్టు తీర్పు మేర‌కు షూట్ చేయాల్సిన ప‌రిస్థితి కాబ‌ట్టి పూర్తి స్థాయిలో శంక‌ర్ మ‌న‌సు ల‌గ్నం చేసి పెండింగ్ ప‌నులు పూర్తి చేయ‌గ‌ల‌రా? అన్న‌ది సందేహంగా మారింది. సాధార‌ణంగానే క్రియేటివ్ ఫీల్డ్ లో ఏ ప‌ని చేయాల‌న్నా? స‌మ‌యం ఎక్కువ ప‌డుతుంది. మ‌న‌సు..మైండ్ ప్ర‌శాంతంగా ఉంటే త‌ప్ప ప‌ని మీద మ‌న‌సు లగ్నం చేయ‌లేని ప‌రిస్థితి. శంక‌ర్ కొంత కాలంగా చ‌ర‌ణ్ సినిమాపైనే మ‌న‌సు పెట్టి ప‌నిచేస్తున్నారు. ఇంత‌లో కోర్టు ఇలా తీర్పునిచ్చింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.