Begin typing your search above and press return to search.

'శంకర్-చరణ్' సినిమా షురూ.. RC15 నుంచి అదిరిపోయే పోస్టర్..!

By:  Tupaki Desk   |   8 Sep 2021 5:33 AM GMT
శంకర్-చరణ్ సినిమా షురూ.. RC15 నుంచి అదిరిపోయే పోస్టర్..!
X
క్రియేటివ్ జీనియస్ శంకర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో భారీ ప్రాజెక్ట్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇది చరణ్ కెరీర్ లో 15వ సినిమా. పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ ప్రారభమైంది. ఈరోజు (సెప్టెంబర్ 8) బుధవారం ఉదయం హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ చిత్రాన్ని పట్టాలెక్కించారు.

#RC15 ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి -దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి - బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మేకర్స్ ఓ అదిరిపోయే పోస్టర్ ని వదిలారు. ఇందులో ప్రధాన నటీనటులు - నిర్మాతలు - సాంకేతిక నిపుణులు అందరూ సూటు బూటు ధరించి చేతిలో ఫైల్స్ పట్టుకుని కనిపిస్తున్నారు.

ఈ భారీ ప్రాజెక్ట్ లో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీకాంత్ - అంజలి - సునీల్ - జయరామ్ - నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. తిరు సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి రచయిత బుర్రా సాయి మాధవ్ సంభాషణలు రాస్తున్నారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తుండగా.. రామజోగయ్య శాస్త్రి - అనంత శ్రీరామ్ కలసి పాటలు రాస్తున్నారు.

శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ పై దిల్‌ రాజు - శిరీష్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దిల్ రాజు బ్యానర్ లో వస్తున్న ఈ 50వ చిత్రానికి హర్షిత్ రెడ్డి సహ నిర్మాత. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందనుంది. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూట్ ప్రారంభం కానుంది. శంకర్ - చరణ్ కాంబోలో రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.