Begin typing your search above and press return to search.

కపూర్ బ్యూటీ క్యాజువల్ లుక్ అదిరింది..!

By:  Tupaki Desk   |   17 Nov 2022 11:30 PM GMT
కపూర్ బ్యూటీ క్యాజువల్ లుక్ అదిరింది..!
X
సెలబ్రిటీ ఫ్యామిలీ నుంచి వచ్చిన భామలు ఏం చేసినా దానికో లెక్క ఉంటుంది. బాలీవుడ్ లో అయితే కపూర్ ఫ్యామిలీ అంటే సూపర్ క్రేజ్. ఆ ఫ్యామిలీ నుంచి ఎవరైనా వస్తే వారికి మంచి ఫాలోయింగ్ ఉంటుంది. అందరు హీరోయిన్స్ అవుతున్నారు తను డైరక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తానని కెరీర్ మొదలు పెట్టింది సంజయ్ కపూర్ తనయురాలు షనయా కపూర్. ఎలాగు సినిమా ఫ్యామిలీ కబట్టి హీరోయిన్ గా అవడం చాలా ఈజీ కానీ అమ్మడు మాత్రం అలా కాకుండా డైరక్షన్ మీద ఫోకస్ పెట్టింది.

షనయా ఇప్పటికే అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేసింది. ఇక లేటెస్ట్ గా బెధాదక్ సినిమా సిల్వర్ స్క్రీన్ పై మెరుస్తుంది షనయా కపూర్. అసిస్టెంట్ డైరక్టర్ గా కెరీర్ మొదలు పెట్టకముందు మోడల్ గా కూడా ప్రయత్నాలు చేసిన షనయా ఇప్పుడు తెరంగేట్రం చేస్తుంది. ఇక హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వకముందే గ్లామర్ షో చేస్తుంది షనయా. లేటెస్ట్ గా అమ్మడు ముంబై వీధుల్లో క్యాజువల్ లుక్ తో కనిపించింది. వైట్ టీ షర్ట్.. షార్ట్.. బ్లాక్ గాగుల్స్ లో అల సైల్ గా వీధుల్లో నడుస్తున్న షనయా ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వకముందే అమ్మడు తన గ్లామర్ షోతో పాపులారిటీ తెచ్చుకుంటుంది. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ షనయ తో ఒక సినిమా ప్లానింగ్ లో ఉన్నారని తెలుస్తుంది. ఈ మూవీతో అమ్మడు బాలీవుడ్ లో లైం లైట్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది.

బీ టౌన్ ఆడియన్స్ ని తన బుట్టలో వేసుకునేందుకు అన్ని విధాలుగా సన్నద్ధం అవుతుంది. షనయా లుక్స్ కచ్చితంగా ఒక స్టార్ హీరోయిన్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయని అనిపిస్తుంది. తప్పకుండా షనయా బాలీవుడ్ ని తన అందాల మత్తులో ఊగిపోయేలా చేయాలని ఫిక్స్ అయ్యింది.

అందుకే ఎంట్రీ ఇవ్వడానికి ముందే పార్టీలు.. ఈవెంట్స్ అంటూ సందడి చేస్తుంది. మరి షనయా బేబీ కూడా బాలీవుడ్ క్రేజీ హీరోయిన్స్ లిస్ట్ లో చేరుతుందా లేదా అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది. అమ్మడి థైస్ షోస్ కి కుర్రాళ్లు సూపర్ అంటుంటే తన ఫోటోలకు వచ్చిన కామెంట్స్ చూసి షనయా తెగ ఎంజాయ్ చేస్తుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.