Begin typing your search above and press return to search.

100 కోట్ల పరిహారం అడుగుతున్న స్టార్‌ సోదరుడు

By:  Tupaki Desk   |   13 April 2019 11:49 AM IST
100 కోట్ల పరిహారం అడుగుతున్న స్టార్‌ సోదరుడు
X
మీటూ ఉద్యమంలో భాగంగా ఎంతో మంది హీరోయిన్స్‌, సినిమా ఇండస్ట్రీకి చెందిన మహిళలు ప్రముఖులపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. మీటూ ఉద్యమం మొదలైన తర్వాత ఎంతో మంది ప్రముఖుల పరువు పోయింది. కొందరు ఇండస్ట్రీకి కూడా దూరం అయిన పరిస్థితి ఏర్పడింది. అయితే కొందరు మాత్రం తామేం తప్పు చేయకున్నా అవమానాలు ఎదుర్కొంటున్నామంటూ కోర్టును ఆశ్రయించారు. తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్దిఖీ సోదరుడు షమాసుద్దీన్‌ సిద్దిఖీ తన పరువు తీశారు అంటూ పరువు నష్టం దావా వేశాడు.

నా ప్రవర్తన కారణంగా పలువురు హీరోయిన్స్‌ నాతో నటించేందుకు ఆసక్తి చూపకుండా పారిపోయారు అంటూ ఒక ప్రముఖ పత్రిక కథనంను రాసింది. ఆ కథనం కారణంగా నా పరువు పోయిందని, నేను హీరోయిన్స్‌ తో ఎంతో గౌరవంగా ఉంటాను, నాతో పని చేసేందుకు హీరోయిన్స్‌ చాలా ఇష్టపడతారు, ఏ ఒక్కరు కూడా నా నుండి దూరంగా వెళ్లి పోలేదు అంటూ ఆయన కోర్టుకు తెలియజేశాడు. కాని సదరు పత్రిక నాపై తప్పుడు కథనంను రాసిందని, ఇప్పుడు నా గురించి ఇండస్ట్రీలో అంతా బ్యాడ్‌ గా అనుకుంటున్నారని, అందుకే నా పరువుకు భంగం కలిగేలా చేయడంతో పాటు, నన్నుమానసిక వేదనకు గురి చేసినందుకు గాను సదరు పత్రిక నాకు 100 కోట్ల నష్ట పరిహారం ఇవ్వాలంటూ జూనియర్‌ సిద్దికి డిమాండ్‌ చేస్తున్నాడు.

బోలే చడియాన్‌ చిత్రంకు దర్శకత్వం వహించిన షమాసుద్దీన్‌ పై మీడియాలో పలు వివాదాస్పద వార్తలు వచ్చాయి. పలు పుకార్లు మీడియాలో షికార్లు చేస్తున్న నేపథ్యంలో ఆయన పరువు నష్టం దావాను వేశాడు. తన తమ్ముడి వివాదంపై ఇప్పటి వరకు నవాజుద్దీన్‌ సిద్దిఖీ స్పందించలేదు.