Begin typing your search above and press return to search.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత... అక్కడ ఫస్ట్ సినిమా!

By:  Tupaki Desk   |   9 Aug 2019 1:30 AM GMT
ఆర్టికల్ 370 రద్దు తర్వాత... అక్కడ ఫస్ట్ సినిమా!
X
ఈమధ్య ఊరి పేర్లతో పెద్ద చిక్కొచ్చిపడింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత హాట్ టాపిక్ గా మారిన అంశం లడఖ్. గతంలో మన తెలుగు పేపర్లలో ఆ ప్రాంతాన్ని ఇలానే ప్రస్తావించేవారు. కానీ ఇప్పుడు దీనిని ఒకరు లద్ధాక్ అంటున్నారు. మరొకరు లదాక్ అంటున్నారు. ఇంకొకరు లడఖ్ అంటారు. ఎలా పిలవాలో.. ఎలా ఏ పేరుతో పిలిస్తే మనకు బొత్తిగా లోక జ్ఞానం లేదని అనుకుంటారో అని చాలామంది తికమకపడుతున్నారు. ఆ పేర్లు పలకాలంటే ముందు వెనక అలోచిస్తున్నారు. అందరూ లద్దాక్ అంటున్నారు కాబట్టి మనం కూడా అదే పేరు ఫిక్స్ అయిపోదాం.

ఇపుడు ఆ ఏరియా పేరు మీద ఎందుకు ఇంత ఇంట్రో అంటే ఈ ఆర్టికల్ 370 రద్దు జరిగిన తర్వాత ఆ ప్రాంతంలో మొదటిసారిగా షూటింగ్ జరుపుకోనున్న చిత్రంగా 'షంషేరా' చరిత్రకెక్కనుంది. రణబీర్ కపూర్.. సంజయ్ దత్.. వాణి కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు కరణ్ మల్హోత్రా. ఈ సినిమాను యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ ను లద్దాక్ ఏరియాలో ప్లాన్ చేశారట.

అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమా అవుట్ పుట్ బాగా రాలేదన్న కారణంగా నిర్మాత ఆదిత్య చోప్రా థియేట్రికల్ రిలీజు లేకుండా ఒకేసారి డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లో విడుదల చేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు కొద్ధిరోజులు గా బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపి స్తున్నాయి. మరి అలాంటి పరిస్థితి ఉంటే "ఈ రేంజ్ లో లద్దాక్ ఏరియాలో షూట్ చేయడం ఎందుకు?" అనే ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు.

అన్నట్టు.. ఇదొక్క సినిమానే కాదు యష్ రాజ్ బ్యానర్ లో తెరకెక్కిన మరో చిత్రం 'సందీప్ పింకీ ఫరార్' అవుట్ పుట్ పై కూడా ఆదిత్య కాన్ఫిడెంట్ గా లేడట. దాన్ని కూడా డిజిటల్ రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడం టూ వార్తలు వస్తున్నాయి. ఈ లిస్టులో కరణ్ జోహార్ సినిమా కూడా మరొకటి ఉంది.. ఆ సినిమా సుశాంత్ రాజ్ పుత్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించిన 'డ్రైవ్'. మరి నిజంగానే ఈ సినిమాలను డిజిటల్ రిలీజ్ తో సరిపెట్టుకుంటారా లేదా థియేటర్లలో కూడా రిలీజ్ చేస్తారా అనే విషయంపై కొద్దిరోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.