Begin typing your search above and press return to search.

ఓయ్ బ్యూటీ రీ ఎంట్రీ

By:  Tupaki Desk   |   3 Jan 2018 8:29 AM GMT
ఓయ్ బ్యూటీ రీ ఎంట్రీ
X
చిరంజీవి అల్ టైం బ్లాక్ బస్టర్ జగదేక వీరుడు అతిలోక సుందరి గుర్తుందిగా. అందులో చైల్డ్ ఆర్టిస్ట్ అందరిలోకి తన ముద్దు ముద్దు మాటలతో బబ్లీ బుగ్గలతో ఆకట్టుకున్న బేబీ షామిలి ఎవరూ మర్చిపోలేరు. మణిరత్నం అంజలి సినిమాతో పరిచయమైన షామిలి పెద్దయ్యాక సిద్దార్థ్ ఓయ్ మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది కానీ ఆ సినిమా ఫ్లాప్ కావడంతో మనవాళ్ళు ఎవరు అవకాశం ఇచ్చే సాహసం చేయలేకపోయారు. షామిలి అజిత్ భార్య శాలిని చెల్లెలు అన్న సంగతి తెలిసిందే. మళ్ళి ఇంత గ్యాప్ తర్వాత షామిలి రీ ఎంట్రీ ఇస్తోంది. సినిమా పేరు అమ్మమ్మగారిల్లు. నాగ శౌర్య హీరోగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ గుట్టు చప్పుడు కాకుండా సైలెంట్ గా జరుపుకుంటోంది. సుందర్ సూర్య అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ మూవీని ఎన్ఆర్ఐలు నిర్మిస్తున్నారు.

కూల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీకు మంచి క్వాలిటీ టీం వర్క్ చేస్తోంది. దర్శకుడిగా మారిన కెమెరామెన్ రసూల్ ఎల్లోర్ చాయాగ్రహణం అందిస్తుండగా, ఒకే సినిమాకు సింగల్ కార్డు రాయడం ఎప్పుడో మానేసిన సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్ని పాటలు రాస్తున్నారు. కళ్యాణి రమణ(కీరవాణి సోదరుడు)ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నారు. అనవసరమైన హైప్ - హడావిడి లేకుండా గప్ చుప్ గా షూట్ చేస్తున్న ఈ మూవీలో క్యాస్టింగ్ పెద్దదిగానే ఉంది. సమ్మర్ లోపు షూటింగ్ ఫినిష్ చేసి మంచి డేట్ లో విడుదల చేయాలనే ప్లానింగ్ లో ఉన్నారు. షామిలి మాత్రం ఓయ్ సినిమాలోలాగా బొద్దుగా కాకుండా బాగా స్లిమ్ గా మారడం ప్లస్ అవుతోంది. అమ్మమ్మగారిల్లు ఎంత సందడిగా ఉంటుందో తెలియాలంటే కొన్ని నెలలు ఆగాల్సిందే.