Begin typing your search above and press return to search.

ఓయ్ పాపాయ్ ఈజ్ బ్యాక్!!

By:  Tupaki Desk   |   30 July 2017 8:13 AM GMT
ఓయ్ పాపాయ్ ఈజ్ బ్యాక్!!
X
మణిరత్నం అంజిలి సినిమాతో వెండ తెర పై బుజ్జి బుజ్జి అడుగులు వేసిన షామిలి ఆ తరువాత కొన్ని సినిమాలలో బాల నటిగా చేసిన మళ్ళీ హీరోయిన్ అయ్యేంత వరకు ప్రపంచానికి కనిపించలేదు. అలా కొన్ని ఏళ్లుగా సినీ అభిమానులు మనసులో బేబీ షామిలిగా ముద్ర వేసుకున్న ఈ అమ్మాయి తెలుగులో 'ఓయ్' సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయ్యింది.

తమిళ్ హీరో సిద్ధార్థ్ తో చేసిన ఓయ్ సినిమా 2009 లో వచ్చింది. ఈ సినిమా ద్వారానే షామిలి హీరోయిన్ గా పరిచయమైంది. కాని ఈ సినిమా మ్యూజిక్ హిట్ అయినంతగా సినిమా హిట్ కాకపోవడం తో షామిలికీ హీరోయిన్ గా అవకాశాలు రాలేదు దానితో మళ్ళీ తెలుగు తెరకు దూరమైంది. ఆ తరువాత కొన్ని తమిళ్ - మలయాళం సినిమాలు చేసిన ఏవి అంతా గుర్తింపుని అయితే తీసుకురాలేక పోయాయి. అందుకే బ్రేక్ తీసుకుని ఇప్పుడు తన లుక్ ని పూర్తిగా మార్చుకొని మళ్ళీ తెలుగు తెర పై నటించడానికి సిద్దపడింది. పవన్ సుందర్ డైరెక్ట్ చేస్తున్న ఒక తెలుగు సినిమాలో నాగ శౌర్య కు జంటగా నటిస్తోంది.

కొద్ది కాలం కిందట షామిలి ఫోటో లు తమిళ్ మీడియా లో సంచలనం రేపాయి. కొంచెం బొద్దుగా ఉండే షామిలి బాగ స్లిమ్ అవ్వడంతో ఆమె ఫిట్ లుకీ చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ఫోటో షూట్ క్రెడిట్ మాత్రమ ఆమె బావ తమిళ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ దక్కుతుంది లెండి. అజిత్ కుమార్ కు ఫోటోగ్రఫి అంటే ఇష్టం కావడంతో షామిలి కోసం ఒక ఫోటో షూట్ ఏర్పాటు చేశాడులే. అందుకే ఇప్పుడు ఎనిమిదేళ్ల తరువాత అమ్మడు తిరిగి తెలుగులోకి వస్తోంది. నాగ శౌర్యతో చేస్తున్న ఈ ప్రేమ కథ షూటింగ్ కూడా మొదలైంది.